రేపు కమలం తీర్థం పుచ్చుకోనున్న దాసోజు శ్రవణ్

రేపు కమలం తీర్థం పుచ్చుకోనున్న దాసోజు శ్రవణ్

తెలంగాణ ఉద్యమకారుడు, సీనియర్ నాయకులు డాక్టర్ దాసోజు శ్రవణ్ కుమార్ బీజేపీలో జాయిన్ అయ్యేందుకు ముహూర్తం ఖరారు అయ్యింది. రేపు ఉదయం 8 గంటలకు బీజేపీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ తరుణ్ చుగ్ సమక్షంలో కమలం తీర్థం పుచ్చుకోనున్నారు. ఇప్పటికే ఢిల్లీలో ఉన్న  శ్రవణ్  బీజేపీ రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జ్ తరుణ్ చుగ్తో భేటీ అయ్యారు. పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ తో కలిసి చుగ్ ను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఆయన శ్రవణ్కు శాలువా కప్పి సత్కరించారు. శ్రవణ్ తో భేటీ అనంతరం మీడియాతో మాట్లాడిన చుగ్ బీజేపీ విద్యార్థి పరిషత్ తో పనిచేసిన శ్రవణ్ తో చాలాకాలం తర్వాత భేటీ కావడం సంతోషం కలిగించిందని అన్నారు. రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులపై చర్చించినట్లు చెప్పారు. 

కేసీఆర్ ప్రభుత్వం రాష్ట్రాన్ని దోచుకుంటోందని తరుణ్ చుగ్ ఆరోపించారు. ఢిల్లీ వచ్చిన బండి సంజయ్ తో పలు అంశాలపై చర్చింనట్లు చెప్పారు. ఆయన నాయకత్వంలో ప్రజా సంగ్రామ యాత్ర మోటార్ సైకిల్ యాత్రలు దిగ్విజయంగా నడుస్తున్నాయని చుగ్ ప్రశంసించారు. ప్రజల ఆశలను టీఆర్ఎస్ సర్కారు వమ్ము చేసిందని, ఆ పార్టీకి త్వరలోనే జనం గుడ్ బై చెప్పనున్నారని చెప్పారు. కేసీఆర్ ఇంటలిజెన్స్ కూడా ఇదే మాట చెబుతోందని అన్నారు.