జూబ్లీహిల్స్‌‌ ఉప ఎన్నికలో కాంగ్రెస్‌‌కు మద్దతు : దాసు సురేశ్‌‌

జూబ్లీహిల్స్‌‌ ఉప ఎన్నికలో కాంగ్రెస్‌‌కు మద్దతు : దాసు సురేశ్‌‌
  • నవీన్‌‌ యాదవ్‌‌ గెలిస్తే బీసీలు గెలిచినట్టే: దాసు సురేశ్‌‌

హైదరాబాద్ సిటీ, వెలుగు: జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో కాంగ్రెస్‌‌ పార్టీకి బీసీ రాజ్యాధికార సమితి మద్దతు ఇస్తున్నట్లు బీసీ రాజ్యాధికార సమితి వ్యవస్థాపక అధ్యక్షుడు దాసు సురేశ్‌‌ తెలిపారు. ఈ మేరకు సోమవారం సోమాజిగూడ ప్రెస్‌‌క్లబ్‌‌లో మీడియాతో ఆయన మాట్లాడారు. 

బీసీ బిల్లుకు మద్దతు ఇచ్చిన ప్రధాన పార్టీలకు ఈ ఉప ఎన్నికలో నిలబెట్టేందుకు బీసీ అభ్యర్థులు దొరకలేదా అని ప్రశ్నించారు. నవీన్ యాదవ్ గెలిస్తే బీసీలు గెలిచినట్లేనని పేర్కొన్నారు. ప్రతిపక్షాలు నవీన్ యాదవ్‌‌పై రౌడీ షీటర్ అనే ముద్రవేసి బురద రాజకీయాలు చేస్తున్నారని ఆయన మండిపడ్డారు.