
ప్రపంచవ్యాప్తంగా పెద్ద మొత్తంలో డేటా జనరేట్ అవుతోంది. ప్రపంచమే అరచేతిలో వాలిపోయిన ఈ తరుణంలో, ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ వంటి డివైజ్ ల ద్వారా ప్రతి రోజూ కోట్ల టెరాబైట్ల డేటా క్రియేట్ అవుతోంది. ఈ డేటాను భారీగా కంపెనీలు ఉపయోగించుకుని, తమ వ్యాపారాలను పెంచుకుంటున్నాయి. కానీ ఈ డేటా ప్రొటక్షన్ మాత్రం క్లారిటీ లోపిస్తోంది.
న్యూఢిల్లీ: డేటా.. ఇదే ఇప్పటి ప్రపంచానికి సరికొత్త ఇంధనం. ఇదే విషయాన్ని ఎన్నో సార్లు ఎంతో మంది ప్రముఖలు చెప్పా రు. ప్రపంచమంతా ఒకదానికొకటి కనెక్ట్ అవుతోన్న ఈ తరుణంలో డేటా ఒక అద్భుత రంగంగా మారుతోంది. స్మార్ట్ ఫోన్లు, స్మార్ట్ వాచ్‌లు, టీవీలు, రిఫ్రిజిరేటర్స్, ఎయిర్ కండీషనర్స్ లాంటి ఇంటెలిజెంట్ కన్జ్యూమర్ డ్యూరబుల్స్ ఒకదానికొకటి కనెక్ట్ అవుతూ ప్రతిరోజూ పెద్ద ఎత్తున డేటాజనరేట్ చేస్తున్నాయి. ఈ కనెక్టెడ్ డివైజ్ ల ద్వారా ఎంత మొత్తంలో డేటా జనరేట్ అవుతుందో తెలిస్తేషాక్ అవ్వాల్సిందే. తాజా రిపోర్టు ప్రకారం మొబైల్స్, స్మార్ట్ టీవీలు, కార్లు వంటి ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్(ఐ-ఓటీ) డివైజ్ ల ద్వారా ప్రతి రోజూ కోట్ల టెరాబైట్ల డేటాక్రియేట్ అవుతోందని తెలిసింది. ఇంత భారీ ఎత్తునడేటా క్రియేట్ కావడం గత రెండేళ్ల నుంచేనని రిపోర్టు పేర్కొంది. పెద్ద మొత్తంలో క్రియట్ అయిన ఈ డేటా..ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీ, మిషన్ లెర్నింగ్ ద్వారా కంపెనీలు మెరుగైన వ్యాపారం చేసుకునేందుకు సహకరిస్తుందని నిపుణులంటున్నారు. డేటాను వాడుతూ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీని అమలు చేయడంద్వారా మెడికల్ డయాగ్నోస్టిక్స్ లో మరింత కచ్చితత్వాన్ని, విద్యాసంస్థలు తమ ఇంటరాక్టివ్ లను పెంచుకోవచ్చని పేర్కొన్నారు.
వందల కొద్దీ ఇండియన్ స్టార్టప్‌లకు డేటానే వెన్నె ముకగా ఉంటోం ది. అయితేఇంత పెద్ద మొత్తంలో జనరేట్ అవుతున్న డేటానువిశ్లేషించడం అంత తేలికైన విషయమేమీ కాదట.ఇంటెల్ ఇండియా సీనియర్ అధికారి అభిప్రాయంప్రకారం.. ఈ భారీ మొత్తంలో డేటాను అనలైజ్ చే-యడానికి సంస్థల వద్ద బ్యాం డ్ విడ్త్ లేదని చెప్పా రు.ఇప్పటి వరకు కూడా కేవలం 2 శాతం డేటానుమాత్రమే అనలైజ్ చేయడం కుదిరిందని తెలిపారు.
కేబినెట్ ఆమోదం నోచుకోనిడేటా ప్రొటక్షన్ బిల్లు….
డేటా జనరేషన్, వాటి ప్రొడక్ట్ ల గురించే మాట్లాడుతున్న కంపెనీలు, డేటాను ఎలా గోప్యంగా ఉంచాలి, వాటిని ఎలా భద్రత పరుస్తారు అనే విషయాలపై క్లారిటీ ఇవ్వలేక పోతున్నాయి. ఇండియాలో ఇప్పటివరకు డేటా ప్రొటక్షన్‌కు సరియైన చట్టాలే లేవు. ప్రస్తుతం డేటా ప్రొటక్షన్ బిల్లు ఇంకా కేబినెట్ ఆమోదం పొందేందుకే వేచి చూస్తోంది. ఇండియన్ కస్టమర్ల డేటాను లోకల్‌గా స్టోర్ చేయాలని, దాని కోసం ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ సమకూర్చుకోవాలని కేంద్ర ప్రభుత్వం కంపెనీలను ఆదేశించింది. అయితే డేటా లోకలైజేషన్‌పై అమెరికాకు చెందిన టెక్ దిగ్గజాలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నాయి. ఈ లోకలైజేషన్ రూల్‌కు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున లాబీయింగ్ చేస్తున్నాయి. ఇండియాలో కోట్లాది మంది ఇంటర్నెట్ యూజర్లు ఉన్నారు. ఇటీవల ఇండియన్ మీడియాతో సమావేశమైన ఐబీఎం సీఈవో గిన్నీ రోమెట్టీ బిజినెస్ డేటానుంచి కన్జూమర్ డేటాను సెపరేట్ చేయాల్సినవసరం ఉందని చెప్పారు. ఫేస్‌బుక్ వ్యవస్థాపకుడు మార్క్ జూకర్‌బర్గ్ కూడా ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. కన్జ్యూ మర్ ప్రైవసీని గౌరవిస్తామంటూ కంపెనీలు హామీ ఇస్తున్నా.. అది ఎంత వరకు మాటలు వరకే.కానీ డేటా ప్రొడక్షన్ బిల్లు తీసుకొచ్చే విషయంలోమాత్రం పారదర్శకత లోపిస్తోందని అభిప్రాయంవ్యక్తమవుతోం ది.