సమగ్ర ఆరోగ్య సమాచారంతో హెల్త్ ప్రొఫైల్ 

సమగ్ర ఆరోగ్య సమాచారంతో హెల్త్ ప్రొఫైల్ 

కాలంతో పోటీ పడుతున్న మనిషికి ఎప్పుడు ఏ రోగం వస్తుందో తెలియని పరిస్థితి. అనారోగ్యం పాలైనప్పుడే కాదు.. అత్యవసర పరిస్థితుల్లో పేషెంట్ ఆరోగ్య పరిస్థితి తెలియక ట్రీట్మెంట్ అందించడంలో ఆలస్యం అవుతుంది. ఇది ఒక్కోసారి మనిషి ప్రాణాల మీదకు తెస్తుంది. ఈ సమస్యకు చెక్ పెట్టేందుకు తెలంగాణ సర్కారు హెల్త్ ప్రొఫైల్ ప్రాజెక్టు చేపట్టింది. హైల్త్ ప్రొఫైల్లో భాగంగా 18 ఏండ్లు నిండిన ప్రతి ఒక్కరిసమగ్ర ఆరోగ్య సమాచారాన్ని సేకరించనున్నారు. ఆ వివరాలను ఆన్లైన్లో పొందుపరిచి సదరు వ్యక్తికి ఈ హెల్త్ కార్డు జారీ చేయనున్నారు.

30 రకాల పరీక్షలు 
హెల్త్ ప్రొఫైల్ రూపకల్పనలో భాగంగా జిల్లా వైద్య సిబ్బంది ఇంటింటికీ వెళ్లి వ్యక్తుల ఆధార్ నెంబరు, ఫోన్ నెంబరును యాప్లో ఎంటర్ చేస్తారు. దీంతో అప్పటికప్పుడు సదరు వ్యక్తి హెల్త్ ప్రొఫైల్ క్రియేట్ అవుతుంది. ఆ తర్వాత అందులో సదరు వ్యక్తి ఎత్తు, బరువు నమోదు చేస్తారు. గతంలో ఉన్న ఆరోగ్య సమస్యలు, సర్జరీల వివరాలు, బీపీ, షుగర్, టీబీ, ఇతర దీర్ఘకాలిక వ్యాధులు ఉంటే ఆ వివరాలను యాప్లో పొందుపరుస్తారు. బ్లడ్ శాంపిల్స్ కలెక్ట్ చేసి సీబీపీ, సీబీసీ, రుమటైడ్ ఫ్యాక్టర్, షుగర్‌‌‌‌‌‌‌‌, హెచ్‌‌‌‌ఐవీ, లిపిడ్ ప్రొఫైల్, థైరాయిడ్ ప్రొఫైల్, లివర్ ఫంక్షన్ టెస్ట్, రీనల్ ఫంక్షన్ టెస్ట్ తదితర 30 పరీక్షలు నిర్వహించి ఆ రిపోర్ట్‌‌‌‌లను ఆయా వ్యక్తుల హెల్త్ ప్రొఫైల్ అకౌంట్‌‌‌‌లో అప్‌‌‌‌లోడ్ చేస్తారు. భవిష్యత్తులో ఏవైనా సమస్యలు తలెత్తితే హెల్త్ ప్రొఫైల్ను చెక్ చేసి వెంటనే అవసరమైన ట్రీట్మెంట్ అందించే అవకాశముంటుంది.

డిజిటల్ హెల్త్ మిషన్
కేంద్రం చేపట్టిన నేషనల్ డిజిటల్ హెల్త్ మిషన్‌లో భాగంగా హెల్త్ అకౌంట్లను క్రియేట్ చేయనున్నారు. కేంద్రం అందుబాటులోకి తెచ్చిన ఈ పోర్టల్‌నే రాష్ట్రం హెల్త్ ప్రొఫైల్ కోసం వాడుకోనుంది. వ్యక్తులు స్వయంగా హెల్త్ అకౌంట్‌ను వెబ్‌సైట్‌లో క్రియేట్ చేసుకునే వెసులుబాటును ఈ పోర్టల్‌ కల్పిస్తుంది. ఈ హెల్త్ కార్డ్లో ఆధార్ నంబర్లాగే .. ఒక యూనిక్ నంబర్ అలాట్ చేస్తారు. ఇదే హెల్త్ అకౌంట్ నంబర్ లేదా హెల్త్ ఐడీగా ఉపయోగపడుతుంది. ఏదైనా హాస్పిటల్ వెళ్లినప్పుడు ఈ ఐడీ చెబితే సరిపోతుంది. ఒకవేళ ఐడీ లేకపోతే… సదరు వ్యక్తి వివరాలు తీసుకుని హాస్పిటల్ వాళ్లే ప్రొఫైల్ క్రియేట్ చేసేలా యాజమాన్యాలు, డాక్టర్లతో రాష్ట్ర ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకుంది.

 

మరిన్ని వార్తల కోసం..

దేశ ముఖచిత్రంలో ములుగు జిల్లా నిలవడం గర్వకారణం

విద్యార్థులకు అండగా మెడికల్ కౌన్సిల్