బోయినిపల్లి, వెలుగు: రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినపల్లి మండలం పాత వరదవెల్లి గ్రామంలోని మిడ్మానేరు బ్యాక్ వాటర్‌లో గుట్టపై ఉన్న దత్తాత్రేయస్వామి జయంతి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. గురువారం పౌర్ణమి సందర్భంగా స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు.
స్వామివారిని దర్శించుకునేందుకు పర్యాటక శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన బోట్లలో భక్తులు చేరుకుని ప్రత్యేక పూజలు చేశారు. ఆలయ కమిటీ ఆధ్వర్యంలో భక్తులకు అన్నప్రసాద వితరణ కార్యక్రమాన్ని చేపట్టారు. డీఎస్పీ నాగేంద్రచారి, సీఐ శ్రీనివాస్, ఎస్ఐ రమాకాంత్ ఆధ్వర్యంలో బందోబస్త్ ఏర్పాటు చేశారు. కొదురుపాక పీహెచ్‌సీ ఆధ్వర్యంలో మెడికల్ క్యాంపు ఏర్పాటు చేశారు.
