సంగారెడ్డి జిల్లాలో పొద్దున కూతురు మృతి.. సాయంత్రం తల్లి ఆత్మహత్య

సంగారెడ్డి జిల్లాలో పొద్దున కూతురు మృతి.. సాయంత్రం తల్లి ఆత్మహత్య

ఝరాసంగం, వెలుగు : అనారోగ్యంతో కూతురు చనిపోవడాన్ని తట్టుకోలేక ఓ తల్లి ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటన సంగారెడ్డి జిల్లా ఝరాసంగం మండలం ఎల్గోయి గ్రామంలో ఆదివారం వెలుగుచూసింది. ఎస్సై పాటిల్‌‌‌‌‌‌‌‌ క్రాంతికుమార్‌‌‌‌‌‌‌‌ తెలిపిన వివరాల ప్రకారం... ఎల్గోయి గ్రామానికి చెందిన బోయిని వెంకట్‌‌‌‌‌‌‌‌, లావణ్య (28) దంపతుల కూతురు వైష్ణవి (3) కొన్ని రోజులుగా న్యుమోనియాతో బాధపడుతోంది.

 దీంతో చిన్నారిని నీలోఫర్‌‌‌‌‌‌‌‌లో చేర్పించగా.. అక్కడ ట్రీట్‌‌‌‌‌‌‌‌మెంట్‌‌‌‌‌‌‌‌ తీసుకుంటూ శనివారం ఉదయం చనిపోయింది. దీంతో స్వగ్రామం తీసుకొచ్చి సాయంత్రం అంత్యక్రియలు పూర్తి చేశారు. కూతురు మరణాన్ని తట్టుకోలేని లావణ్య సాయంత్రం ఇంట్లో ఉరి వేసుకుంది. కొద్దిసేపటి తర్వాత కుటుంబ సభ్యులు గమనించగా.. అప్పటికే చనిపోయి కనిపించింది. ఉదయం కూతురు, సాయంత్రం తల్లి చనిపోవడం కుటుంబంలో విషాదాన్ని నింపింది. మృతురాలి భర్త బోయిని వెంకట్‌‌‌‌‌‌‌‌  ఫిర్యాదుతో కేసు నమోదు చేసినట్లు ఎస్సై తెలిపారు.