తల్లి మృతిని తట్టుకోలేక యువతి సూసైడ్

V6 Velugu Posted on Jul 18, 2021

చిట్యాల, వెలుగు: తల్లి మృతిని తట్టుకోలేక కూతురు సూసైడ్​ చేసుకుంది. ఎస్సై వీరభద్ర రావు తెలిపిన ప్రకారం.. జయశంకర్ భూపాలపల్లి జిల్లా చిట్యాల మండలం ఒడితలకు చెందిన పట్టెం భవాని(17) ఇంటర్ చదువుతోంది. కరోనా కారణంగా విద్యాసంస్థలు మూతపడడంతో ఇంటివద్దే ఉంటుంది. రెండు నెలల క్రితం తల్లి వరలక్ష్మి కరోనాతో మృతిచెందింది. అప్పటి నుంచి తీవ్ర బాధతో ఉన్న భవాని శనివారం ఇంటి వెనుకకు వెళ్లి పురుగుల మందు తాగింది. కుటుంబసభ్యులు గమనించి చిట్యాల గవర్నమెంట్​ హాస్పిటల్​కు తరలించగా చికిత్స పొందుతూ చనిపోయింది. మృతురాలికి తండ్రి వీరస్వామి, సోదరి, సోదరుడు ఉన్నారు.
 

Tagged mother died, daughter committe suicide, Chityal, jayashankar bhupalapally

Latest Videos

Subscribe Now

More News