అరకులో తండ్రీ కూతుళ్ల సవాల్

అరకులో తండ్రీ కూతుళ్ల సవాల్

వెలుగు: లోక్ సభ ఎన్నికల్లో తండ్రిపై కూతురు పోటీ చేస్తున్న అరుదైన సందర్భం ఏపీలోని అరకు నియోజకవర్గంలో చోటు చేసుకుంది. టీడీపీ అభ్యర్థి, కేంద్ర మాజీ మంత్రి వి.కిశోర్ చంద్రదేవ్ పై ఆయన కూతురు వి.శ్రుతి దేవి కాంగ్రెస్ అభ్యర్థిగా బరిలోకి దిగారు. ఆరుసార్లు లోక్ సభ ఎంపీగా ఎన్నికైన కిశోర్ చంద్రదేవ్ ఇటీవల టీడీపీలో చేరారు. కాంగ్రెస్ తో నాలుగు దశాబ్దాల బంధాన్ని ఆయన వదులుకున్నారు. లాయర్ గా ప్రాక్టీస్ చేస్తున్న ఆయన కూతురు శ్రుతిని కాంగ్రెస్ తెరముందుకు తెచ్చింది. గురువారం నామినేషన్ వేసిన శ్రుతి మాట్లాడుతూ.. “నా సేవలను గుర్తించి కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇచ్చింది. ఎన్నికల్లో విజయం నాదే” అని అన్నారు. తన తండ్రి గురించి ఒక్క మాట కూడా ఆమె మాట్లాడలేదు.

విజయనగరంలో ఎంపీ, ఎమ్మెల్యే అభ్యర్థులుగా తండ్రీకూతుళ్లు
విజయనగరం జిల్లాలో కేంద్ర మాజీ మంత్రి అశోక్ గజపతిరాజు, ఆయన కుమార్తె అదితి విజయలక్ష్మి ఎన్నికల బరిలో ఉన్నారు. విజయనగరం లోక్ సభ, అసెంబ్లీ స్థానాలకు టీడీపీ అభ్యర్థులుగా అశోక్ గజపతిరాజు, అదితి పోటీ చేస్తున్నారు.