తల్లి చనిపోయి 3 రోజులు : డబ్బు, బంగారం కోసం అంత్యక్రియలు చేయకుండా కూతుళ్ల కొట్లాట

తల్లి చనిపోయి 3 రోజులు : డబ్బు, బంగారం కోసం అంత్యక్రియలు చేయకుండా కూతుళ్ల కొట్లాట

బంధాలు అనుబంధాలు అంతా బూటకం.. జగన్నాటకం.. సినిమాలో చూస్తే.. వింటే కథ అనుకున్నాం.. ఇప్పుడు ఇవన్నీ రియల్ మన కళ్ల ముందు.. మన చుట్టూ జరుగుతున్నాయి. సూర్యాపేట జిల్లా ఆత్మకూరు ఎస్ మండల కేంద్రంలో జరిగిన ఈ ఘటన.. ఆస్తులు, అంతస్తులపై జనంలో ఉన్న మమకారాలకు సాక్ష్యంగా కనిపిస్తుంది. 

సూర్యాపేట జిల్లా ఆత్మకూరు ఎస్ మండల కేంద్రంలో.. పొదిలి నరసమ్మ అనే వృద్ధురాలు చనిపోయింది. ఆమె చనిపోయి కూడా మూడు రోజులు అయ్యింది. ఈ 3 రోజులు ఇంట్లోని ఐస్ బాక్సులో పెట్టారు ఆమెను. అంత్యక్రియలు చేయకుండా మూడు రోజులుగా పంచాయితీ నడుస్తుంది ఆ ఇంట్లో.. 

పొదిలి నరసమ్మకు ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. తల్లి చనిపోయిన తర్వాత ఆమె దగ్గర ఉన్న 12 లక్షల రూపాయల డబ్బు, ఆరు తులాల బంగారం కోసం ఇద్దరు కుమార్తెలు గొడవ పడుతున్నారు. ఈ పంచాయితీ తెగే వరకు.. 12 లక్షల డబ్బు, 6 తులాల బంగారం వ్యవహారం కొలిక్కి వచ్చే వరకు అంత్యక్రియలు చేసేది లేదని ఇద్దరు కూతుళ్లు పంతంపట్టి గొడవ పడుతున్నారు.

పొదిలి నరసమ్మ దగ్గర ఉన్న 8 ఎకరాల భూమిని.. ఆమె బతికి ఉన్నప్పుడే పంచుకున్నారు కూతుళ్లు. ఇప్పుడు ఆమె దగ్గర ఉన్న డబ్బు, బంగారం కోసం ఈ పంచాయితీ నడుస్తుంది. 

►ALSO READ | బాలుడిపై లైంగిక వేధింపుల ఆరోపణలు..ఆత్మహత్య చేసుకున్న టీచర్

ఈమెను చివరి చూపు కోసం వచ్చిన బంధువులు, చుట్టాలు, ఇరుగుపొరుగు వారు ఇద్దరు కూతుళ్లకు ఎంత నచ్చచెప్పినా వినటం లేదు. అంత్యక్రియల తర్వాత ఆస్తుల విషయం తేల్చుకోండి.. ఇప్పటికే మూడు రోజులు అయ్యింది.. అంత్యక్రియలు చేయండి అని ఎంత చెప్పినా వినటం లేదు. డబ్బు, బంగారం పంపకాలు పూర్తయిన తర్వాతనే అంత్యక్రియలు అంటూ మూడు రోజులుగా మొండిపట్టుపట్టి.. ఇంట్లోనే 3 రోజులుగా మృతదేహాన్ని ఉంచారు. 

 ఇంటి చుట్టుపక్కల వాళ్ల సమాచారంతో పోలీసులు వచ్చారు. ఇద్దరు కూతుళ్లతో మాట్లాడారు. అంత్యక్రియలు పూర్తి చేయండి.. ఆ తర్వాత మీరు మీరు పంచాయితీ పెట్టుకోండి అని సర్ధిచెబుతున్నారు. అబ్బే.. కూతుళ్లు మాత్రం ససేమిరా అంటున్నారంట..