వెస్టిండీస్‌‌‌‌పై 70 రన్స్తో చెలరేగిన వార్నర్‌‌‌‌

వెస్టిండీస్‌‌‌‌పై 70  రన్స్తో చెలరేగిన వార్నర్‌‌‌‌

హోబర్ట్‌‌‌‌: వెస్టిండీస్‌‌‌‌తో మూడు మ్యాచ్‌‌‌‌ల టీ20 సిరీస్‌‌‌‌లో ఆస్ట్రేలియా బోణీ చేసింది. కెరీర్‌‌లో100వ టీ20లో స్టార్‌‌‌‌ ఓపెనర్‌‌‌‌ డేవిడ్‌‌‌‌ వార్నర్‌‌‌‌ (36 బాల్స్‌‌‌‌లో 12 ఫోర్లు, 1 సిక్స్‌‌‌‌తో 70) బ్యాటింగ్‌‌‌‌లో చెలరేగడంతో  శుక్రవారం జరిగిన తొలి మ్యాచ్‌‌‌‌లో 11 రన్స్‌‌‌‌ తేడాతో విండీస్‌‌‌‌పై గెలిచింది. ఫలితంగా సిరీస్‌‌‌‌లో 1–0 లీడ్‌‌‌‌లో నిలిచింది. టాస్‌‌‌‌ ఓడిన ఆసీస్‌‌‌‌ 20 ఓవర్లలో 213/7 స్కోరు చేసింది.

వార్నర్‌‌‌‌తో పాటు జోష్‌‌‌‌ ఇంగ్లిస్‌‌‌‌ (39), టిమ్‌‌‌‌ డేవిడ్‌‌‌‌ (37 నాటౌట్‌‌‌‌), మాథ్యూ వేడ్‌‌‌‌ (21) రాణించారు. ఛేజింగ్‌‌లో విండీస్‌‌‌‌ 20 ఓవర్లలో 202/8 స్కోరుకే పరిమితమైంది. బ్రెండన్‌‌‌‌ కింగ్‌‌‌‌ (53), జాన్సన్‌‌‌‌ చార్లెస్‌‌‌‌ (42), జేసన్‌‌‌‌ హోల్డర్‌‌‌‌ (34 నాటౌట్‌‌‌‌) పోరాడారు.  జంపా 3, స్టోయినిస్‌‌‌‌ 2 వికెట్లు తీశారు. వార్నర్‌‌‌‌కు ‘ప్లేయర్‌‌‌‌ ఆఫ్‌‌‌‌ ద మ్యాచ్‌‌‌‌’ అవార్డు లభించింది. రెండో టీ20 ఆదివారం జరుగుతుంది. 

అన్ని ఫార్మాట్లలో వందేసి మ్యాచ్‌‌లతో రికార్డు

ఈ మ్యాచ్‌‌‌‌తో వార్నర్‌‌‌‌ అరుదైన రికార్డును అందుకున్నాడు. అన్ని ఫార్మాట్లలో వందేసి ఇంటన్నేషనల్ మ్యాచ్‌‌‌‌లు ఆడిన తొలి ఆసీస్‌‌‌‌ ప్లేయర్‌‌‌‌గా రికార్డు సృష్టించాడు. కోహ్లీ, రాస్‌‌‌‌ టేలర్‌‌‌‌ సరసన నిలిచాడు. కెరీర్‌‌‌‌లో వంద టీ20లు ఆడిన మూడో ఆసీస్‌‌‌‌ ప్లేయర్‌‌‌‌గా రికార్డులకెక్కాడు. ఫించ్‌‌‌‌, మ్యాక్స్‌‌‌‌వెల్‌‌‌‌ ముందున్నారు.