వార్నర్ ట్రిపుల్.. పాక్ ట్రబుల్

వార్నర్ ట్రిపుల్.. పాక్ ట్రబుల్

అడిలైడ్‌‌: ఓపెనర్‌‌ డేవిడ్‌‌ వార్నర్‌‌ (418 బంతుల్లో 39 ఫోర్లు 1 సిక్సర్‌‌‌‌తో 335 నాటౌట్‌‌) రికార్డు ట్రిపుల్‌‌ సెంచరీతో చెలరేగడంతో.. పాకిస్థాన్‌‌తో జరుగుతున్న డేనైట్‌‌ టెస్ట్‌‌లో ఆస్ట్రేలియా పట్టు బిగించింది. మార్నస్‌‌ లబుషెన్‌‌ ( 238 బంతుల్లో 22 ఫోర్లతో 162) అండగా నిలవడంతో.. శనివారం రెండో రోజు ఆసీస్‌‌ తొలి ఇన్నింగ్స్‌‌ను 127 ఓవర్లలో 589/3 స్కోరు వద్ద డిక్లేర్‌‌ చేసింది. తర్వాత బ్యాటింగ్‌‌కు దిగిన పాక్‌‌ ఆట ముగిసే సమయానికి తొలి ఇన్నింగ్స్‌‌లో 35 ఓవర్లలో 6 వికెట్లకు 95 రన్స్‌‌ చేసింది. బాబర్ ఆజమ్‌‌ (43 బ్యాటింగ్‌‌), యాసిర్‌‌‌‌ షా (4 బ్యాటింగ్‌‌) పోరాడుతున్నారు. స్టార్క్‌‌ (4/22) ధాటికి పాక్‌‌ టాప్‌‌ ప్లేయర్లు పెవిలియన్‌‌కు క్యూ కట్టారు. షాన్‌‌ మసూద్‌‌ (19), ఇమామ్‌‌ (2), అజర్‌‌ అలీ (9), అసద్‌‌ షఫీక్‌‌ (9), ఇఫ్తికార్‌‌ అహ్మద్‌‌ (10), మహ్మద్‌‌ రిజ్వాన్‌‌ (0) ఘోరంగా విఫలమయ్యారు. ప్రస్తుతం పాక్‌‌ టీమ్‌‌ ఇంకా 493 రన్స్‌‌ వెనుకబడి ఉంది.

రికార్డులే.. రికార్డులు

302/1 ఓవర్‌‌నైట్‌‌ స్కోరుతో రెండో రోజు ఆట కొనసాగించిన వార్నర్‌‌, లబుషేన్‌‌ నిలకడగా ఆడారు. సునామీలా పాక్‌‌ బౌలింగ్‌‌పై విరుచుకుపడ్డ వార్నర్‌‌.. ట్రిపుల్‌‌ సెంచరీతో రికార్డులను కొల్లగొట్టాడు. ఓ దశలో బ్రియాన్‌‌ లారా (400 నాటౌట్‌‌) రికార్డును బ్రేక్‌‌ చేసేలా కనిపించిన వార్నర్‌‌కు.. డిక్లేర్ నిర్ణయం అడ్డంకిగా మారింది. 289 బాల్స్‌‌లో ట్రిపుల్‌‌ సెంచరీని అందుకున్న వార్నర్‌‌.. నాలుగో ఫాస్టెస్ట్‌‌ బ్యాట్స్‌‌మన్‌‌గా రికార్డులకెక్కాడు. ఈ జాబితాలో సెహ్వాగ్‌‌ (278, 364), హెడెన్‌‌ (364) ముందున్నారు. టీమిండియా క్రికెటర్‌‌ కరుణ్‌‌ నాయర్‌‌ (2016) తర్వాత ఓ బ్యాట్స్‌‌మన్‌‌ చేసి తొలి ట్రిపుల్‌‌ సెంచరీ ఇది. 2012లో మైకేల్‌‌ క్లార్క్‌‌ (329) తర్వాత ఆసీస్‌‌ బ్యాట్స్‌‌మన్‌‌ చేసిన మొదటి ట్రిపుల్‌‌. అలాగే సంగక్కర (2014) తర్వాత ఓ లెఫ్టాండర్‌‌ చేసిన ట్రిపుల్‌‌ సెంచరీ కూడా ఇదే. ఆసీస్‌‌ తరఫున వార్నర్‌‌ (335 నాటౌట్‌‌)దే అత్యధిక స్కోరు. హెడెన్‌‌ (380) ముందున్నాడు. అడిలైడ్‌‌లో హయ్యెస్ట్‌‌
వ్యక్తిగత స్కోరు చేసిన బ్రాడ్‌‌మన్‌‌ (299) రికార్డును వార్నర్‌‌ దాటేశాడు. డేనైట్‌‌ టెస్ట్‌‌లో ఇది రెండో ట్రిపుల్‌‌ సెంచరీ. గతంలో అజర్‌‌ అలీ (302) ఈ ఫీట్‌‌ను సాధించాడు. రెండో ఎండ్‌‌లో లబుషెన్‌‌ కూడా మెరుగ్గా ఆడటంతో రెండో వికెట్‌‌కు 366 పరుగులు సమకూరడంతో ఆసీస్‌‌ భారీ స్కోరు సాధ్యమైంది. అడిలైడ్‌‌లో ఏ వికెట్‌‌కైనా ఇదే అత్యధిక భాగస్వామ్యం. లబుషెన్‌‌ ఔటైన తర్వాత క్రీజులోకి వచ్చిన స్మిత్‌‌ (36) విఫలమయ్యాడు.