IND vs AUS: దూకుడుగా ఆసీస్..2వ రోజు ముగిసిన ఆట

IND vs AUS: దూకుడుగా ఆసీస్..2వ రోజు ముగిసిన ఆట

ఢిల్లీలో భారత్, ఆస్ట్రేలియా మధ్య   జరుగుతోన్న రెండో టెస్టు రెండో రోజు ఆట ముగిసింది. ఆట ముగిసే సమయానికి ఆసీస్ ఒక వికెట్ నష్టానికి 61 పరుగులు చేసింది.  క్రీజులో ట్రావిస్ హెడ్ 39, లబుషేంజ్ 16 పరుగులతో క్రీజులో ఉన్నారు. దీంతో ప్రస్తుతం ఆస్ట్రేలియా   62 పరుగుల  లీడ్ లో ఉంది. 

అంతకుముందు  ఓవర్ నైట్ స్కోర్ 21 పరుగులతో ఇవాళ  ఇన్నింగ్స్ ను స్టార్ట్ చేసిన టీమిండియా 262 పరుగులకు ఆలౌట్ అయ్యింది.  దీంతో ఫస్ట్ ఇన్నింగ్స్ లో ఆసీస్ కు ఒక పరుగు అధిక్యం దక్కింది. టీమిండియా టాప్ ఆర్డర్ విఫలమవ్వగా ..  విరాట్ కోహ్లీ 44, జడేజా 26 పరుగులతో జట్టును ఆదుకున్నారు. ఆ తర్వాత వచ్చిన ఆల్ రౌంటర్ అక్షర్ పటేల్ అద్భుతమైన ఇన్నింగ్స్ 74 పరుగులకు తోడు .. అశ్విన్ 37 పరుగులు చేయడంతో టీమిండియా 262 పరుగులు చేయగల్గింది.  ఇక ఆసీస్ బౌలర్లలో నాథన్‌ లైయన్‌ ఒక్కడే ఐదు వికెట్లు తీయగా.. మర్ఫీ 2, కుహ్నేమన్ 2 వికెట్లు తీశారు.  అంతకుముందు ఆసీస్ తొలి ఇన్నింగ్స్ లో 263 పరుగులు చేసింది.