హైదరాబాద్​లో కల్తీ మందులు స్వాధీనం

హైదరాబాద్​లో కల్తీ మందులు స్వాధీనం

దేశంలో ఇప్పుడు కల్తీ రాజ్యం ఏలుతుంది.  ఉప్పుదగ్గరి నుంచి చివరకు ఆరోగ్యాన్ని కాపాడుకొనే మందుల వరకు నకిలీవి మార్కెట్లో చలామణి అవుతున్నాయి.  ఇప్పుడు హైదరాబాద్​  గండిపేటలోని ఓ ఫార్మసీ దుకాణంలో  ఫేక్​ఆయుర్వేద టాబ్లెట్స్​ ను   డ్రగ్స్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్(DCA ) అధికారులు స్వాధీనం చేసుకున్నారు. పుప్పాలగూడలో ఆయుర్వేదానికి చెందిన  పానియన్​ టాబ్లెట్స్​ రుమాటిజం వ్యాధికి మందు.. ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని  డ్రగ్స్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్(DCA ) అధికారులు గుర్తించారు.  ఇది  డ్రగ్స్ అండ్ మ్యాజిక్ రెమెడీస్  చట్టం, 1954కి విరుద్ధమని డీసీఏ డైరెక్టర్ జనరల్ వీబీ కమలాసన్ రెడ్డి తెలిపారు. ముందస్తు సమాచారం మేరకు దాడిచేసి ఆరోగ్యానికి హాని కలిగించే పానియన్​ టాబ్లెట్స్​ను DCA అధికారులు స్వాధీనం చేసుకున్నారు. దుకాణ యజమానిపై కేసు నమోదు చేసి చట్ట రకారంగా చర్యలు తీసుకుంటామని తెలిపారు. 

మార్చి 27న సేరిలింగంపల్లి DCA అధికారులు జరిపిన ప్రత్యేక దాడుల్లో ఈ ఔషధాన్ని గుర్తించారు.  ఈ మందు పంజాబ్​ లోని లూథియానాలో విన్​ ట్రస్ట్​ ఫార్మాసూటికల్స్​ లిమిటెడ్​ దీనిని తయారు చేసిందని డీసీఏ తెలిపింది.  ఈ మందుకు సంబంధించిన లేబుల్​లోరుమాటిక్ ఆర్థరైటిస్, గౌట్, ఆస్టియో ఆర్థరైటిస్ & ఫైబ్రేటైటిస్' చికిత్స కోసం అని తప్పుగా ఉందని డీసీఏ అధికారి కమలాసన్​ రెడ్డి తెలిపారు.  రుమాటిజం చికిత్సకు సంబంధించి దీనిని  డ్రగ్స్ అండ్ మ్యాజిక్ రెమెడీస్ చట్టం, 1954 ప్రకారం నిషేధించారు.   సేరిలింగంపల్లి అసిస్టెంట్​ డైరక్టర్​ అనిల్​ కుమార్​ ఆధ్వర్యంలో గండిపేట డ్రగ్స్ ఇన్ స్పెక్టర్ డి.శ్వేతబిందు ఈ దాడులు నిర్వహించారు.