రైతుల ఇళ్లకు తాళాలు.. ఖమ్మం డీసీసీబీ అధికారుల అత్యుత్సాహం

రైతుల ఇళ్లకు తాళాలు.. ఖమ్మం డీసీసీబీ అధికారుల అత్యుత్సాహం

ఖమ్మం జిల్లా సహకార కేంద్ర (డీసీసీ) బ్యాంకు అధికారులు అత్యుత్సాహం ప్రదర్శించారు. తీసుకున్న లోన్లు తిరిగి చెల్లించలేదని రైతుల ఇళ్లకు తాళం వేసి, సీజ్ చేశారు. నేలకొండపల్లి మండలం రామచంద్రాపురంలోని సహకార సంఘంలో సుర్దేపల్లి, రామచంద్రాపురం గ్రామాలకు చెందిన కొంతమంది JLG గ్రూపుల ద్వారా ఋణాలు తీసుకున్నారు. దీనికి  సంబంధించి మొత్తం 55 మంది సభ్యులు ఐదు లక్షల వరకు రుణాలు చెల్లించాల్సి ఉంది.ఇందులో కొందరు 10 వేలు మాత్రమే చెల్లించాల్సి ఉంది. అయితే డీసీసీబీ బ్యాంకు అధికారులు ఇవాళ  ఇళ్లకు తాళాలు వేసి నోటీసులు అంటించారు. కరోనా పరిస్థితుల వల్ల కట్టలేకపోయమని బాధితులు చెబుతున్నారు. నోటీసులు ఇచ్చి ఏడాదైనా తీసుకున్న లోన్లు కట్టలేదంటున్నారు బ్యాంకు అధికారులు. డబ్బులు చెల్లిస్తేనే తాళాలు తీస్తామంటున్నారు.

మరిన్ని వార్తల కోసం..

ఏపీలో కరోనా వైరస్ విజృంభణ

ఇమ్యూనిటీ ఫుడ్ ఇస్తలే.. గాంధీలో కరోనా పేషెంట్ల ఆవేదన

జాతీయ యుద్ధ స్మారక జ్యోతిలో అమర్ జవాన్ జ్యోతి విలీనం