పార్టీ బలోపేతానికి కృషి చేయాలి..మంత్రి వివేక్ వెంకటస్వామి

పార్టీ బలోపేతానికి కృషి చేయాలి..మంత్రి వివేక్ వెంకటస్వామి
  • జిల్లా ఇన్​చార్జి మంత్రిని కలిసిన డీసీసీ ప్రెసిడెంట్ ​ఆంక్షారెడ్డి

గజ్వేల్, వెలుగు: సిద్దిపేట జిల్లా డీసీసీ ప్రెసిడెంట్​గా నియమితులైన తూంకుంట ఆంక్షారెడ్డి మంగళవారం రాష్ట్ర మంత్రులను మర్యాద పూర్వకంగా కలిసి కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా జిల్లా ఇన్​చార్జి మంత్రి వివేక్​ వెంకటస్వామితో పాటు మంత్రులు దుద్దిల్ల శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్, శ్రీహరి, సీతక్క, ఎమ్మెల్యే రాజ్ సింగ్ ఠాకూర్ తదితరులను కలిసి పుష్పగుచ్చాలు అందజేశారు. 

సిద్దిపేట జిల్లాలో కాంగ్రెస్ పార్టీకి పూర్వవైభవం వచ్చేలా కృషి చేయాలని వారు ఆమెకు సూచించారు. తాను కష్టపడి పార్టీ బలోపేతానికి పనిచేస్తానని ఆంక్షారెడ్డి తెలిపారు. ఆమెతో పాటు మాజీ ఎమ్మెల్యే నర్సారెడ్డి, మాజీ ఎంపీపీ మోహన్, కాంగ్రెస్ నేతలు శివారెడ్డి, గాడిపల్లి శ్రీనివాస్ ఉన్నారు.