ఆదిలాబాద్, వెలుగు : నేతలు, కార్యకర్తల సమిష్టి కృషితోనే పార్టీ బలోపేతమవుతుందని, అప్పుడే మనకు ప్రజల్లో గౌరవం దక్కుతుందని డీసీసీ అధ్యక్షుడు అనిల్ జాదవ్ అన్నారు. అధ్యక్షుడిగా ఎంపికైన తర్వాత మొదటి సారి జిల్లా కేంద్రంలోని టీఎన్జీవో భవనంలో స్థానిక సంస్థల ఎన్నికలపై సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో రాష్ట్రం అభివృద్ధిలో దూసుకుపోతుందన్నారు.
పార్టీ కోసం కష్ట పడి పని చేసిన వారికి సముచిత స్థానం దక్కుతుందని అన్నారు. గ్రామ పంచాయతీ ఎన్నికల్లో పార్టీ గెలుపుకోసం ప్రతి ఒక్కరు కష్టపడాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో డీసీసీబీ చైర్మెన్ అడ్డి బోజారెడ్డి, జిల్లా గ్రంథాలయ చైర్మెన్ మల్లెపూల నర్సయ్య, మాజీ ఎంపీ సోయం బాపూరావు ,మాజీ ఎమ్మెల్యే రాథోడ్ బాపూరావు,బోథ్ అసెంబ్లీ ఇంచార్జ్ ఆడే గజేందర్,ఆసిఫాబాద్ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షురాలు ఆత్రం సుగుణ, మాజీ జెడ్పీటీసీ గోక గణేష్ రెడ్డి, గండ్రత్ సుజాత, బాలురి గోవర్ధన్ రెడ్డి, సంజీవ్ రెడ్డి, గిమ్మ సతోష్ రావు, తదితరులు పాల్గొన్నారు.
