సీఎం పనితీరుకే మున్సిపల్ ఎన్నికల్లో విజయం

సీఎం పనితీరుకే మున్సిపల్ ఎన్నికల్లో విజయం
  • డీసీసీ అధ్యక్షుడు పున్నా కైలాశ్ నేత 

నల్గొండ అర్బన్, వెలుగు:  సీఎం రేవంత్ రెడ్డి సారథ్యంలో అమలవుతున్న సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలకు జనమోదం లభించిందని నల్గొండ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు  పున్న కైలాస్ నేత అన్నారు. శుక్రవారం నల్గొండ జిల్లాలో వెలువడిన మున్సిపల్, కార్పొరేషన్ ఫలితాలపై ఆయన నివాసంలో విలేకరులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రెండు సంవత్సరాలుగా సీఎం రేవంత్ రెడ్డి పనితీరుకు రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలోకి తీసుకుపోతున్న ఆయన నాయకత్వానికి ప్రజామోదం లభించిందన్నారు.  

ప్రజాపాలన ఆరు గ్యారెంటీలు, ప్రతిఫలం మున్సిపల్ కార్పొరేషన్ లో కాంగ్రెస్ అభ్యర్థుల విజయానికి దోహదపడ్డాయన్నారు. జిల్లా నాయకులు జిల్లపెల్లి పరమేశ్ , ముంతాజ్ అలీ, రాంబాబు నాయుడు, చింతమల్ల వెంకటయ్య, రేవిందర్ రెడ్డి, పగిళ్ల రాజు, చర్లపల్లి గౌతమ్ తదితరులు పాల్గొనారు.