త్వరలో చర్ల ఆస్పత్రిలో ఆపరేషన్ థియేటర్ : డీసీహెచ్ రవిబాబు

త్వరలో చర్ల ఆస్పత్రిలో ఆపరేషన్ థియేటర్ : డీసీహెచ్ రవిబాబు
  • డీసీహెచ్​ రవిబాబు

భద్రాచలం, వెలుగు : చర్ల ఆస్పత్రిలో త్వరలో ఆపరేషన్​ థియేటర్​ను ప్రారంభిస్తున్నామని , ప్రారంభోత్సవ కార్యక్రమానికి రావాలని ఐటీడీఏ పీవో బి.రాహుల్​ను డీసీహెచ్​ రవిబాబు ఆహ్వానించారు. పీవోతో చాంబర్​లో శనివారం ఆయనతో పాటు వైద్యాధికారులు భేటీ అయ్యారు. జిల్లాలో ఆస్పత్రుల్లో జరుగుతున్న సేవలను పీవోకు వివరించారు. ఈ సందర్భంగా పీవో రాహుల్​ మాట్లాడుతూ ఏరియా వైద్యశాలల్లో ఇటీవల ఆపరేషన్లు విజయవంతంగా నిర్వహించడంపై వైద్యసిబ్బందిని అభినందించారు.

భద్రాచలం, పాల్వంచ, చర్ల, మణుగూరు, ఇల్లెందు, బూర్గంపాడు, అశ్వారావుపేట పీహెచ్​సీల్లో డాక్టర్ల నియామకం చేపట్టినట్లు తెలిపారు. ప్రతీ గిరిజన గ్రామంలో మెడికల్ క్యాంపులు పెట్టి, రక్త పరీక్షలు చేయడం వల్ల వ్యాధుల తీవ్రత తక్కువగా ఉందని చెప్పారు. రికార్డులు నిర్వహణ సక్రమంగా ఉండాలని సూచించారు. వచ్చే మూడు నెలలు వ్యాధుల పట్ల అలర్ట్​గా ఉండాలని సూచించారు. పీవోను కలిసిన వారిలో భద్రాచలం ఏరియా ఆస్పత్రి సూపరింటెండెంట్ ​రామకృష్ణ ఉన్నారు.