గొర్లకాపరుల డీడీలు వాపస్​ ఇవ్వాలి

గొర్లకాపరుల డీడీలు వాపస్​ ఇవ్వాలి

నారాయణపేట, వెలుగు: గతప్రభుత్వం చేపట్టిన గొర్ల పంపిణీ  పథకానికి డీడీలు చెల్లించి, ఇంకా యూనిట్లు పొందని గొర్ల కాపరులకు డీడీలు వాపస్​ ఇవ్వాలని వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కిల్లె గోపాల్​ డిమాండ్​ చేశారు.  పెంపకందారుల సంఘం ఆధ్వర్యంలో పశుసంవర్థక  శాఖ ఆఫీస్​ ఎదుట  ధర్నా చేపట్టారు.  ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గొర్ల కాపరులు నానా ఇబ్బందులు పడి గొర్ల కోసం అప్పులుతెచ్చి ప్రభుత్వానికి చెల్లించినా గత ప్రభుత్వం  మోసం చేసిందన్నారు. 

వెంటనే రాష్ట్ర ప్రభుత్వం  స్పందించి డీడీలు వెనక్కి ఇవ్వాలని డిమాండ్​ చేశారు.  కార్యక్రమంలో  వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి గోపాల్, గొర్లకాపరుల సంఘం జిల్లా నాయకులు కనకప్ప, అంజప్ప, గోవిందు, వెంకటప్ప, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.