
కామారెడ్డి టౌన్, వెలుగు : కామారెడ్డి జిల్లాలో డీ- అడిక్షన్ సెంటర్ ఏర్పాటుకు ఆసక్తి, అర్హత ఉన్న సంస్థల నుంచి అప్లికేషన్లను స్వీకరించనున్నట్లు ఐసీడీఎస్ జిల్లా అధికారి ప్రమీల ఆదివారం తెలిపారు. ఆసక్తి ఉన్నవారు ఈ నెల 30 వరకు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలన్నారు. పూర్తి వివరాలకు కలెక్టరేట్లోని సంక్షేమాధికారి ఆఫీసు రూమ్ నంబర్ 31లో సంప్రదించాలని సూచించారు.