హైదరాబాద్ లో డీఈ-సీఐఎక్స్ రెండో పీఓపీ 

హైదరాబాద్ లో డీఈ-సీఐఎక్స్ రెండో పీఓపీ 

హైదరాబాద్​, వెలుగు: ఇంటర్నెట్ ఎక్చేంజ్ ఆపరేటర్​ భారతదేశ అనుబంధ సంస్థ డీఈ-సీఐఎక్స్ ఇండియా వెబ్ వెర్క్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌తో కలిసి తన సేవలను విస్తరించింది. ఇందులో భాగంగా హైదరాబాద్ లో రెండో పాయింట్​ఆఫ్​ప్రెజెన్స్​( పీఓపీ)ను ఏర్పాటు చేసింది. హైదరాబాద్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లోని కంటెంట్ ప్రొవైడర్స్, ఎంటర్ ప్రైజెస్ కు డీఈ-సీఐఎక్స్ ఇండియా  ప్రీమియం ఇంటర్నెట్ సర్వీసులు అందుబాటులోకి వస్తాయి. వీటిలో  పీరింగ్, డైరెక్ట్ క్లౌడ్,  మైక్రోసాఫ్ట్ అజ్యూర్ పీరింగ్ సర్వీస్​ కూడా ఉంటాయి. డీఈ-సీఐక్స్ ఇండియా... ముంబై, ఢిల్లీ, చెన్నై, కోల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కతా  హైదరాబాద్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లలో ఇంటర్నెట్ ఎక్స్ఛేంజ్​లను ఏర్పాటు చేసింది.