ఉస్మానియాలో మృతదేహాలు తారుమారు

ఉస్మానియాలో మృతదేహాలు తారుమారు

ఉస్మానియా హాస్పిటల్ మార్చురీలో దారుణం జరిగింది. సిబ్బంది నిర్లక్ష్యంతో మృతదేహాలు తారుమారయ్యాయి. ఒకరి మృతదేహం బదులు మరో మృతదేహాన్ని బంధువులకు అప్పగించడంపై మృతుల బంధువులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రాజేంద్రనగర్ శివరాంపల్లికి చెందిన పాండురంగాచారి అనారోగ్యంతో ఉస్మానియా హాస్పిటల్లో చేరాడు. చికిత్స పొందుతూ మృతి చెందాడు. ఇదే సమయంలో ఎస్సార్ నగర్కు చెందిన మరో వ్యక్తి హాస్పిటల్లో కన్నుమూయడంతో ఇద్దరి మృతదేహాలను మార్చురీకి తరలించారు. అయితే  సిబ్బంది నిర్లక్ష్యంతో పాడురంగా చారి డెడ్ బాడీని ఎస్సార్ నగర్కు చెందిన వ్యక్తి కుటుంబ సభ్యులకు అప్పగించారు. పాండురంగాచారి మృతదేహం కోసం ఉస్మానియా మార్చురీకి వెళ్లి కుటుంబసభ్యులు మృతదేహం కనిపించకపోవడంతో సిబ్బందిని నిలదీశారు. దీంతో మృతదేహాలు తారుమారైన విషయం వెలుగులోకి వచ్చింది. పాండురంగాచారి బంధువులు ఎస్సార్ నగర్కు చేరుకునే సరికి అంత్యక్రియలు పూర్తయ్యాయి. మార్చురీ సిబ్బంది నిర్లక్ష్యంపై ఇరువురి కుటుంబసభ్యులు మండిపడుతున్నారు.

మరిన్ని వార్తల కోసం..

ప్రధాన మంత్రి మ్యూజియం ప్రారంభించిన మోడీ

ఒక్కటైన బాలీవుడ్ ప్రేమ జంట