
న్యూఢిల్లీ: ప్రధానమంత్రి సంగ్రహాలయం భవిష్యత్ తరాలకు స్ఫూర్తిదాయకమని ప్రధాని నరేంద్ర మోడీ అన్నారు. ఢిల్లీలో ప్రధానమంత్రి సంగ్రహాలయ పేరుతో ఏర్పాటు చేసిన మ్యూజియంను గురువారం మోడీ ప్రారంభించారు. ఇప్పటి వరకు భారత ప్రధానిగా పనిచేసిన వారందరికీ ఈ మ్యూజియంను గత ప్రధానమంత్రులకు అంకితం చేశారు. తర్వాత మ్యూజియంలో మొదటి టికెట్ కొనుగోలు చేశారు. దేశానికి స్వాతంత్ర్యం వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు ప్రధానమంత్రులు చేసిన సేవలను ఈ మ్యూజియంలో ప్రదర్శించనున్నారు. అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో దీనిని నిర్మించారు. హోలోగ్రామ్స్, వర్చువల్ రియాలిటీ, మల్టీ టచ్ మల్టీమీడియా, ఇంటరాక్టివ్ స్క్రీన్స్ వంటివి ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డితో పలువురు పాల్గొన్నారు.
#WATCH | Delhi: Prime Minister Narendra Modi inaugurated 'Pradhanmantri Sangrahalaya'- a museum dedicated to the country's Prime Ministers since Independence, earlier today.
— ANI (@ANI) April 14, 2022
(Source: PMO) pic.twitter.com/HEG5l49J9D
మరిన్ని వార్తల కోసం..