శవాలు మారుతున్నాయి : నిర్లక్ష్యపు నీడలో గాంధీ సిబ్బంది

శవాలు మారుతున్నాయి : నిర్లక్ష్యపు నీడలో గాంధీ సిబ్బంది

మొన్నటికి మొన్న మధుసూదన్ అనే వ్యక్తి డెడ్ బాడీ మిస్సింగ్ ..! రెండు రోజుల క్రితం ఒకరికి బదులు మరొకరి శవం అప్పగింత..! గాంధీలో కొద్దిరోజులుగా కరోనాతో చనిపోయిన వారి డెడ్ బాడీలపై ఏదో ఒక వివాదం రేగుతూనే ఉంది. ఆ ఘటనలు మరుపున పడకముందే తాజాగా అలాంటిదే మరో ఘటన జరిగింది. ఒక కుటుంబానికి ఇవ్వా ల్సిన డెడ్ బాడీని  మరో కుటుంబానికి అప్పగించి గాంధీ సిబ్బంది నిర్లక్ష్యం చూపించారు. పహాడీషరిఫ్ కు చెందిన మహబూబ్ అనే వ్యక్తి, నాంపల్లికి చెందిన రషీద్ అలీఖాన్ అనే వ్యక్తి బుధవారం గాంధీ ఆస్పత్రి లో కరోనాతో చనిపోయారు. మహబూబ్ కుటుంబ సభ్యులకు రషీద్  బాడీని గాంధీ సిబ్బంది అప్పగించారు. అయితే, డెడ్ బాడీని చెక్ చేసుకొని కుటుంబ సభ్యులు తీసుకెళ్లి ఖననం చేశారు. మరోవైపు రషీద్ కుటుంబ సభ్యులు అతడి డెడ్ బాడీ కోసం బుధవారం నుంచి వేచి చూసినా అప్పగించలేదు. తీరా చూస్తే మార్చురీలో రషీద్ డెడ్ బాడీ లేదు దీంతో వివాదం రేగింది. విషయం తెలుసుకున్న డీఎంఈ కె.రమేష్ రెడ్డి గాంధీ ఆస్పత్రికి  వచ్చి పరిస్థితిని సమీక్షించారు. మార్చురీలోని ఫైళ్లను తనిఖీ చేశారు. మహబూబ్ శవం ఉండడం చూసి ఇద్ద రి డెడ్ బాడీలు తారు మారైనట్టు తేల్చారు. సిబ్బంది నిర్లక్ష్యంపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ విషయాన్ని రెండు కుటుంబాల సభ్యులకు చెప్పినా సాయంత్రం వరకు ఎవరూ ఆస్పత్రికి రాలేదని తెలుస్తోంది.

ఇదినాలుగోసారి…

గాంధీ ఆస్పత్రిలో శవాల అప్పగింతకు సంబంధించి ఎప్పుడూ ఏదో ఒక వివాదం రేగుతూనే ఉంది. గతంలో లాలాపేటకు చెందిన బహదూర్ అనే నేపాలీ దేశస్థుడు నడుస్తూ నడ స్తూనే కుప్పకూలి చనిపోయాడు. టెస్ట్ చేయగా కరోనా అని తేలింది. అతడి శవం ఏమైందో కూడా ఇప్పటికీ తెలియదు. ఆ తర్వాత వనస్థలి పురానికి చెందిన మధుసూదన్ అనే వ్యక్తి కరోనాతో చనిపోయాడు. డెడ్ బాడీని కుటుంబ సభ్యులకు అప్పగిం చకుండా, కనీసం సమాచారమూ ఇవ్వకుండా దహనం చేశారు. దీనిపై అతడి భార్య హైకోర్టును ఆశ్రయించగా ఎంత వివాదం రేగిందో తెలిసిందే. రెండు రోజుల క్రితం బేగంపేట గురుమూర్తి నగర్ కు చెందిన ఓ వ్యక్తి చనిపోగా, వేరే శవాన్నివారి కు టుంబసభ్యులకు ఇచ్చారు. తీరా శ్మశానవాటికకు వెళ్న లి తర్వాతగానీ వేరే వ్యక్తి డెడ్ బాడీ అని గుర్తిం చలేకపోయారు అతడి భార్య, కొడుకు. ఆ శవాన్ని తిరిగి గాంధీకి తీసుకొచ్చి అసలు శవాన్ని తీసుకె ళ్లారు. ఈ క్రమంలోనే నాలుగోసారి ఇప్పుడు మరో ఘటన జరిగింది.