మంచు కరిగి శవాలు తేలుతున్నయ్‌‌

మంచు కరిగి శవాలు తేలుతున్నయ్‌‌

గ్లోబల్‌‌ వార్మింగ్‌‌ వల్ల వేడి విపరీతంగా పెరిగిపోయి మంచు పర్వతాలు కరుగుతున్నాయి. సముద్రాల నీటి మట్టాలు పెరుగుతున్నాయి. ఊహించని పరిణామాలు ఎదురవుతున్నాయి. ముఖ్యంగా పర్వత ప్రాంతాల్లో తప్పిపోయిన వారి మృతదేహాలు బయటపడుతున్నాయి. ఎందుకంటే అంత ఎత్తులో, గడ్డ కట్టే చలిలో బ్యాక్టీరియా పెరగదు. మృతదేహాలు కుళ్లిపోవు. కాబట్టి పోలీసులు ఈజీగా మృతదేహాలను గుర్తుపడుతున్నారు. ఏళ్లుగా పరిష్కారమవని కేసులను క్లోజ్‌‌ చేస్తున్నారు. 1987లో ఓ జర్మన్‌‌ టూరిస్టు ఆల్పైన్‌‌ పర్వతాల్లో తప్పిపోయారు. ఆయన మృతదేహాన్ని 2017లో పోలీసులు గుర్తించారు. 75 ఏళ్ల కిందట మిస్సైన జంట అవశేషాలు కూడా గుర్తించారు. పైగా 5,300 ఏళ్ల కిందట చనిపోయిన ఓ వ్యక్తి బాడీని కుళ్లిపోని స్థితిలో ఆల్ప్స్‌‌లో 1991లో కనుగొన్నారు.