కారులో డెడ్ బాడీ.. ఛేదించిన పోలీసులు

కారులో డెడ్ బాడీ.. ఛేదించిన పోలీసులు

తిరుమలగిరి మర్డర్ కేసును నార్త్ జోన్ టాస్క్ ఫోర్స్ పోలీసులు ఛేదించారు. రియల్ ఎస్టేట్ వ్యాపారి  విజయ్ భాస్కర్ రెడ్డిని కజిన్ నరేందర్ రెడ్డి మర్డర్ చేసినట్లు పోలీసులు తేల్చారు. నిందితుడు తోట నరేందర్ రెడ్డిని అరెస్ట్ చేసి.. రెండు పిస్టల్స్, 6 బులెట్స్, 7 లక్షల 20 వేల నగదు స్వాధీనం చేసుకున్నట్లు హైదరాబాద్ కమిషనర్ అంజనికుమార్ తెలిపారు. కమిషనర్ ఆఫీసులో ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్ లో నిందితుడిని ప్రవేశపెట్టి పూర్తి వివరాలు తెలియజేశారు.

‘తోట నరేందర్ క్యాబ్ డ్రైవర్ గా పనిచేస్తూ.. రియల్ ఎస్టేట్ బ్రోకర్ గా కూడా పని చేస్తున్నాడు. ఓ ప్లాట్ సేల్ విషయం గురించి మాట్లాడాలని భాస్కర్ రెడ్డికి ఫోన్ చేశాడు. దాంతో భాస్కర్ రెడ్డి కారులో బయలుదేరి వెళ్లాడు. అక్కడ ప్లాట్ సేల్ విషయంలో ఇద్దరి మధ్యా గొడవ తలెత్తితింది. దాంతో అసహనానికి లోనైన నరేందర్ రెడ్డి.. డ్రైవింగ్ సీట్లో ఉన్న భాస్కర్ రెడ్డిని గన్ తో కాల్చి చంపాడు.  తన భర్త కనిపించడంలేదని భాస్కర్ రెడ్డి భార్య స్వప్న ఈ నెల 29న ఫిర్యాదు చేసింది. మరుసటి రోజు తిరుమలగిరిలో రోడ్డు పక్కన పార్క్ చేసిన కారులో భాస్కర్ రెడ్డి డెడ్ బాడీ లభించింది. కారులో లభించిన బుల్లెట్, చుట్టుపక్కల ఉన్న సీసీ కెమెరాల ద్వారా కేసును ఛేదించి.. నిందితుడిని గుర్తించాం’ అని కమిషనర్ అంజనికుమార్ తెలిపారు.