మోడల్ స్కూల్ అప్లికేషన్ల గడువు పెంపు

మోడల్ స్కూల్ అప్లికేషన్ల గడువు పెంపు

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలోని మోడల్ స్కూళ్లలో అడ్మిషన్ల కోసం దరఖాస్తు గడువును ఈ నెల 11 వరకూ పెంచినట్టు అడిషనల్ డైరెక్టర్ రమణ కుమార్ తెలిపారు. ఈ నెల3తో దరఖాస్తు గడువు ముగియగా..పేరెంట్స్, స్టూడెంట్ల విజ్ఞప్తి మేరకు మరోసారి గడువు పెంచినట్టు పేర్కొన్నారు. 

ఓసీ స్టూడెంట్లకు రూ.200, ఎస్సీ, ఎస్టీ, బీసీ, పీహెచ్, ఈబ్ల్యూఎస్ అభ్యర్థులకు రూ.125 ఫీజు ఉంటుందని చెప్పారు.