
భిక్కనూరు, వెలుగు: గ్యాస్ సిలిండర్ లబ్ధిదారులు ప్రతి ఒక్కరూ కచ్చితంగా తమ గ్యాస్ సభ్యత్వ బుక్ తో స్ధానిక ఆఫీస్కు వచ్చి వేలి ముద్రలు వేయాలని సంబంధిత గ్యాస్ సెంటర్ల డీలర్లు ఆదేశించారు. మంగళవారం మండల కేంద్రంలోని హెచ్‌పీ గ్యాస్ ఆఫీస్ వద్ద లబ్ధిదారులు పెద్ద సంఖ్యలో పాల్గొని వేలి ముద్రలు వేశారు.
ఈ సందర్భంగా గ్యాస్ ఎజెన్సీ నిర్వాహకులు మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు అసలు గ్యాస్ లబ్ధిదారులు ఉన్నారో లేదో గుర్తించే ప్రక్రియ అన్నారు. ఒకవేళ లబ్ధిదారులు చనిపోతే వారి స్థానంలో కుటుంబ సభ్యులకు సభ్యత్వం కల్పించేందుకు ఆదేశాలు వచ్చాయన్నారు. ఈ ప్రక్రియ డిసెంబర్31 వరకు ఉంటుందని లబ్ధిదారులు ఆందోళన చెందకూడదని గ్యాస్ ఏజెన్సీ నిర్వాహకులు తెలిపారు.