పాశమైలారం ఘటన..41కి చేరిన మృతుల సంఖ్య

పాశమైలారం ఘటన..41కి చేరిన మృతుల సంఖ్య

పాశమైలారం సిగాచీ పరిశ్రమ పేలుడు ఘటనలో మృతుల సంఖ్య 41కి చేరింది. ధృవ ఆస్పత్రిలో ఆరు రోజులుగా చికిత్స పొందుతోన్న సతీష్ అనే వ్యక్తి  జులై 6న మృతి చెందాడు. లేటెస్ట్ గా మరో మృతదేహాన్ని గుర్తించారు  అధికారులు.. ఇంకా తొమ్మిది మంది మృతదేహాలను గుర్తించాల్సి ఉంది. మృతుల కుటుంబాలు  పటాన్ చెరు ప్రభుత్వ ఆస్పత్రి దగ్గర పడిగాపులు గాస్తున్నారు. 

మరో వైపు ఈ ఘటనలో ఇంకా సహాయక చర్యలు కొనసాగుతోన్నాయి.  ఎస్ డీఆర్ఎఫ్,హైడ్రా సిబ్బంది భవన  ఇథిలాలను  పూర్తిస్థాయిలో తొలగిస్తోంది. వీటిని పక్కనే మరో చోట డంప్‌ చేసిన తర్వాత.. అందులో గాలిస్తుండగా రెండు ఎముకలు బయటపడ్డాయి. దీంతో ఇంకా ఏమైనా అవశేషాలు దొరుకుతాయేమోననే అనుమానంతో రెస్క్యూ టీం ప్రయత్నాలు చేస్తోంది. అయితే శిథిలాల తొలగింపు నిరంతరాయంగా కొనసాగుతున్నా, ఇంకా తొమ్మిది మంది ఆచూకీ మాత్రం దొరకడం లేదు. 

►ALSO READ | నెల రోజుల్లో అప్లికేషన్లు పరిష్కరించాలి

ఈ ఘటనలో మృతులకు ఒక్కొక్కరికి రూ. కోటి పరిహారం ఇస్తున్నట్లు సిగాచీ పరిశ్రమ ప్రకటించిన సంగతి తెలిసిందే. కంపెనీని మూడు నెలల పాటు క్లోజ్ చేస్తున్నట్లు తెలిపింది.  ప్రభుత్వం సీఎస్ నేతృత్వంలో ఏర్పాటు చేసిన హైలెవల్ కమిటీ  సిగాచీ ఘటనపై పూర్తి స్థాయిలో దర్యాప్తు చేస్తోంది.