మహారాష్ట్రలో విజృంభిస్తున్న కరోనా:ఇప్పటికే ఐదుగురు చనిపోయారు

మహారాష్ట్రలో విజృంభిస్తున్న కరోనా:ఇప్పటికే ఐదుగురు చనిపోయారు

మహారాష్ట్రలో కరోనా విజృంభిస్తోంది. రోజురోజుకు కొత్త కేసులు పెరిగిపోతున్నాయి. మహారాష్ట్రలోని పలు జిల్లాలతోసహా ముంబై మహానగరంలో కేసులు పెరిగిపోతున్నాయి. వయసుతో సంబంధం లేకుండా కోవిడ్ బారిన పడి చనిపోతున్నారు.  మే 19 నుంచి ఇప్పటివరకు 210 కేసులు నమోదు కాగా  ఐదుగురు చనిపోయారు. కోవిడ్ విజృంభిస్తుండటంతో ఐసోలేషన్ వార్డులు, ఆర్టీపీసీఆర్ ల్యాబ్లను ఏర్పాటు చేశారు అధికారులు.   

మహారాష్ట్రలో మంగళవారం(మే 27న) 66 కొత్త కేసులు నమోదు అయ్యాయి. వీటిలో సగం ముంబై నుంచే ఉన్నాయి. ఇతర జిల్లాల్లో కోవిడ్ కేసులు తక్కువగానే ఉన్నాయి. ఫూణెలో 18, థానేలో 7, నవీ ముంబైలో 4, పింప్రి చించ్వాడ్ లో 3, నాగ్ పూర్ లో 2, సింగ్లిలో 1 నమోదయ్యాయి.  మహారాష్ట్రలో ప్రస్తుతం 210 యాక్టివ్ కేసులున్నాయి. 

ఇక దేశ వ్యాప్తంగా కరోనా కేసులు వివరాలు చూస్తే.. దేశంలో కరోనా చాపకింద నీరులా వ్యాప్తిస్తోంది. క్రమంగా కరోనా కేసులు పెరుగుతున్నాయి. దేశంలో ప్రస్తుతం 1010 యాక్టివ్ కేసులున్నాయి. అత్యధికంగా కేరళలో 430 కేసులు నమోదు అయ్యాయి.దీంతో అధికారులు అంతా అప్రమత్తం అయ్యారు. ఎక్కడికక్కడ ఆస్పత్రుల్లో బెడ్లను ఏర్పాటు చేస్తూనే.. ప్రజలంతా జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తున్నారు. 

►ALSO READ | స్పెర్మ్ డోనార్ విషయంలో పొరపాటు.. 10 మంది పిల్లలకు క్యాన్సర్, ఏమైందంటే..?

గత కొన్ని వారాలలో కోవిడ్-19 కేసులలో పెరుగుదల స్పష్టంగా కనిపిస్తోంది. జనవరి నుంచి నమోదైన 285 కేసుల్లో మే నెలలోనే 269 కేసులు నమోదయ్యాయి. అదనంగా మే 18 నుంచి కోవిడ్-19 ఉన్న నలుగురు రోగులు మృతిచెందారు. వీరిలో కిడ్నీ సమస్యలున్న 14 ఏళ్ల బాలిక, 59 ఏళ్ల క్యాన్సర్ రోగి, గుండె సమస్యలున్న 70 ఏళ్ల వృద్ధుడు ,డయాబెటిస్  కీటోయాసిడోసిస్‌తో 21 ఏళ్ల యువకుడు చనిపోయారు. 

సింగపూర్, హాంకాంగ్‌లలో పెరుగుతున్న COVID-19 కేసుల దృష్ట్యా, భారత్ అప్రమత్తమయింది. కోవిడ్ నియంత్రణ చర్యలు ముమ్మరం చేసింది. ఓమిక్రాన్ కుటుంబంలో ఒకటై JN.1 వేరియంట్ ఈ కోవిడ్ కేసుల పెరుగుదలకు కారణమని నిపుణులు చెబుతున్నారు. ప్రజారోగ్యాన్ని కాపాడటంలో చురుగ్గా ఉంటూనే ప్రమాదాలను తగ్గించడానికి పరిస్థితిని జాగ్రత్తగా సమీక్షిస్తున్నామని ఆరోగ్య మంత్రిత్వ శాఖ పేర్కొంది.అయితే కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ రిపోర్టు ప్రకారం.. ప్రస్తుత COVID-19 ఇన్ఫెక్షన్లు చాలావరకు తేలికపాటివని, మరణాల రేటు లేదని తెలుస్తోంది.