
డిఫెన్స్ బయో ఇంజినీరింగ్ అండ్ ఎలక్ట్రో మెడికల్ లాబొరేటరీ (డీఈబీఈఎల్ డీఆర్ డీఓ) జూనియర్ రీసెర్చ్ ఖాళీల భర్తీకి అప్లికేషన్లు కోరుతున్నది. ఆసక్తి, అర్హత గల అభ్యర్థులు ఆన్ లైన్ ద్వారా అప్లై చేయవచ్చు. అప్లికేషన్ల సమర్పణకు చివరి తేదీ జూన్ 27.
- పోస్టులు: జూనియర్ రీసెర్చ్ ఫెలో 02.
- ఎలిజిబిలిటీ: పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో బీఈ లేదా బీటెక్, ఎంఈ లేదా ఎంటెక్ తో పాటు గేట్ వ్యాలిడ్ స్కోర్ కలిగి ఉండాలి.
- వయోపరిమితి: గరిష్ట వయోపరిమితి 28 ఏండ్లు. నిబంధనలను అనుసరించి సంబంధిత వర్గాలకు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది.
- అప్లికేషన్: ఆన్లైన్ ద్వారా.
- అప్లికేషన్లు ప్రారంభం: జూన్ 09.
- లాస్ట్ డేట్: జూన్ 27
- సెలెక్షన్ ప్రాసెస్: ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు.
- పూర్తి వివరాలకు drdo.gov.in వెబ్ సైట్లో సంప్రదించగలరు.