డెబిట్‌‌కార్డులు తగ్గుతున్నయ్​

డెబిట్‌‌కార్డులు తగ్గుతున్నయ్​

చెన్నై : డెబిట్‌‌కార్డుల వాడకం బాగా తగ్గిపోయింది. మార్చి నుంచి మే మధ్య కాలంలో సర్కులేషన్ లోని డెబిట్‌‌కార్డులు 10 కోట్ల వరకు తగ్గినట్టు తెలిసింది. అంటే 92.4 కోట్ల కార్డుల నుంచి 82.4 కోట్ల కార్డుల వరకు తగ్గాయి.చాలా బ్యాంక్‌‌లు ప్రస్తుతం మ్యాగ్నటిక్ స్ట్రిప్ బేస్‌‌ కార్డులను చిప్ బేస్డ్‌‌ కార్డులుగా మారుస్తున్నాయి. ఈ నేపథ్యంలో సర్కులేషన్‌‌లో ఉన్న కార్డుల సంఖ్య తగ్గినట్టు తెలుస్తోంది. డెబిట్‌‌కార్డులు బాగా తగ్గిపోయిన బ్యాంకుల్లో పీఎన్‌‌బీ మొదటిస్థానంలో ఉంది. ఈ బ్యాంక్ డెబిట్‌‌కార్డులు 5.2 కోట్ల వరకు తగ్గిపోయాయి.  బ్యాంక్ ఆఫ్ ఇండియా డెబిట్‌‌కార్డులు కూడా 2.2 కోట్లు, ఎస్‌‌బీఐ డెబిట్‌‌కార్డులు1.9 కోట్లు తగ్గిపోయినట్టు ఆర్‌‌‌‌బీఐ డేటా పేర్కొంది. ఆర్‌‌‌‌బీఐ మార్గదర్శకాల ప్రకారం.. ఏప్రిల్ 29 లోపు మ్యాగ్నటిక్ స్ట్రిప్ బేస్డ్ డెబిట్‌‌కార్డులను, కొత్త ఈఎంఐ చిప్ బేస్డ్‌‌ కార్డులుగా మార్చాలి.

బ్యాంక్‌‌లు ప్రస్తుతం కార్డులను చిప్ బేస్డ్ కార్డులుగా మారుస్తున్న నేపథ్యంలో ఈ సంఖ్య తగ్గిపోయిందని, వచ్చే నెలల్లో వీటి సంఖ్య పెరుగుతుందని బ్యాంకర్లు చెప్పారు.  అయితే మొత్తం క్రెడిట్ కార్డుల సంఖ్య మాత్రం మే నెలలో 3.86 కోట్ల నుంచి 4.89 కోట్లకు పెరిగింది. వీటిలో ఎక్కువ సంఖ్యలో హెచ్‌‌డీఎఫ్‌‌సీ బ్యాంక్‌‌  క్రెడిట్ కార్డులున్నాయి. ఇప్పుడు1.26 కోట్ల హెచ్‌‌డీఎఫ్‌‌సీ బ్యాంక్ క్రెడిట్ కార్డులు చలామణిలో ఉన్నాయి. హెచ్‌‌డీఎఫ్‌‌సీ బ్యాంక్ తర్వాత ఎస్‌‌బీఐకి చెందిన 87 లక్షలు క్రెడిట్ కార్డులు,యాక్సిస్ బ్యాంక్‌‌కు చెందిన 62లక్షల  కార్డులు చలామణిలో ఉన్నట్టు ఆర్‌‌‌‌బీఐ డేటాలో తెలిసింది. మేలో డెబిట్, క్రెడిట్ కార్డుల లావాదేవీలు మాత్రం పెరిగాయని ఆర్​బీఐ తెలిపింది.