డిసెంబర్ 16న మంత్రి సీతక్కకు రవీంద్రభారతిలో సన్మానం

డిసెంబర్ 16న మంత్రి సీతక్కకు రవీంద్రభారతిలో సన్మానం

ఖైరతాబాద్, వెలుగు: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ములుగు నుంచి ఎమ్మెల్యేగా గెలిచి మంత్రి పదవి దక్కించుకున్న ధనసరి అనసూయ అలియాస్  సీతక్కకు ఈ నెల 16న రవీంద్రభారతిలో సన్మానం చేయనున్నట్లు గిరిజన శక్తి రాష్ట్ర అధ్యక్షుడు కొర్ర శరత్ నాయక్ తెలిపారు. మంగళవారం సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ఉదయం 10 గంటల నుంచి ఒంటిగంట వరకు సన్మాన కార్యక్రమం ఉంటుందని.. సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క హాజరుకానున్నట్లు ఆయన చెప్పారు. సీతక్కతో పాటు గిరిజన ఎమ్మెల్యేలకు సన్మానం ఉంటుందన్నారు.  గిరిజన ఉద్యోగులు, ప్రజా, విద్యార్థి సంఘాల  నాయకులు, యువతీ యువకులు పాల్గొనాలని ఆయన కోరారు.  సమావేశంలో  ఆదివాసీ విద్యార్థి సంఘం రాష్ట్ర అధికార ప్రతినిధి చంద మహేశ్,  అసిస్టెంట్ ఇన్‌కం ట్యాక్స్‌ కమిషనర్ ప్రకాశ్‌ రాథోడ్‌ తదితరులు పాల్గొన్నారు.

సీతక్కను కలిసిన ఆదివాసీ స్టూడెంట్లు

ఓయూ:  ఆదివాసీ స్టూడెంట్లు మంగళవారం మంత్రి సీతక్కను కలిసి విషెస్ తెలిపారు.  ఆదివాసీ ఆడబిడ్డ, బడుగు, బలహీన సామాజిక వర్గాల ఆశాజ్యోతి సీతక్క మంత్రిగా ప్రమాణ స్వీకారం చేపట్టడం యావత్ సమాజానికే గర్వకారణమని పేర్కొన్నారు.  కార్యక్రమంలో అసోసియేషన్​ నాయకులు సాగబోయిన పాపారావు, కుంజా లక్ష్మీనారాయణ  తదితరులు ఉన్నారు.