వైన్ షాపుల ముందు భారీ క్యూ

వైన్ షాపుల ముందు భారీ క్యూ

తెలంగాణలో డిసెంబర్ నెలలో రికార్డు స్థాయిలో మద్యం అమ్మకాలు జరిగాయి. డిసెంబర్ ఫస్ట్ నుంచి ఇవాల్టి వరకు 3 వేల 350 కోట్ల రూపాయల మద్యం అమ్ముడైంది. ఇవాళ ఒక్కరోజే సాయంత్రం 5 గంటల వరకు 40 లక్షల కేసుల లిక్కర్ అమ్మకాలు జరిగాయని అధికారులు చెప్తున్నారు. ఈ ఏడేళ్ల చరిత్రలో మద్యం అమ్మకాల్లో ఇదే రికార్డని అంటున్నారు అధికారులు. 

రాష్ట్రంలో 2 వేల 620 వైన్స్ షాపులుంటే.... వెయ్యి బార్ అండ్ రెస్టారెంట్లు ఉన్నాయి. మామూలుగా లిక్కర్ నెలకు 28 లక్షల కేసులు అమ్మకాలు జరిగాయి. డిసెంబర్ నెలలో మాత్రం 40 లక్షల కేసుల అమ్మకాలు జరిగాయి. నెలకు 26 లక్షల కేసులు అమ్ముడయ్యాయి. కానీ డిసెంబర్ లో మాత్రం 34 లక్షల కేసులు బీర్లు మద్యం డిపోల్ నుంచి అమ్మకాలు జరిగాయి.