
న్యూఢిల్లీ: భారతీయ ఆటోమొబైల్ కంపెనీల అమ్మకాలు గత నెల తగ్గాయి. ముఖ్యంగా చిన్న కార్ల విభాగంలో భారీ పతనం కనిపించింది. దేశంలోని అతిపెద్ద కార్ల తయారీ సంస్థలైన మారుతి సుజుకి, హ్యుందాయ్ మోటార్ ఇండియా దేశీయ వాహన సరఫరాలో రెండంకెల తగ్గుదల ఉంది.
మారుతి సుజుకి దేశీయ ప్యాసింజర్ బండ్ల విక్రయాలు గత ఏడాది జూన్‌తో పోలిస్తే 13 శాతం తగ్గి 1,18,906 యూనిట్లకు చేరుకున్నాయి. హ్యుందాయ్ కూడా దేశీయ మార్కెట్లో తన సరఫరా 12 శాతం తగ్గి 44,024 యూనిట్లకు చేరుకుందని తెలిపింది. మహీంద్రా అండ్ మహీంద్రా సేల్స్18 శాతం పెరిగాయి. టాటా మోటార్స్ పీవీ, ఈవీల అమ్మకాలు 15 శాతం తగ్గి 37,083 యూనిట్లుగా నమోదయ్యాయి.
టయోటా కిర్లోస్కర్ మోటార్ అమ్మకాలు 5 శాతం పెరిగి 28,869 యూనిట్లకు చేరుకోగా, జేఎస్‌డబ్ల్యూ ఎంజీ మోటార్ ఇండియా 21 శాతం వృద్ధితో 5,829 యూనిట్లను విక్రయించింది. బజాజ్ ఆటో దేశీయ విక్రయాలు 13 శాతం తగ్గగా, రాయల్ ఎన్‌ఫీల్డ్ దేశీయ అమ్మకాలు16 శాతం పెరిగాయి. టీవీఎస్ మోటార్ కంపెనీ టూవీలర్ల అమ్మకాలు 10 శాతం పెరిగాయి.