ఐటీ కంపెనీలపై ఉద్యోగులకు తగ్గుతున్న నమ్మకం

ఐటీ కంపెనీలపై ఉద్యోగులకు తగ్గుతున్న నమ్మకం

న్యూఢిల్లీ : గ్లోబల్‌‌‌‌ ఎకానమీ నెమ్మదించడం, తగ్గుతున్న డిమాండ్.. ఫలితంగా గ్లోబల్‌‌‌‌గా టెక్నాలజీ కంపెనీలు పెద్ద మొత్తంలో ఉద్యోగులను తీసేస్తున్నాయి.  గత ఏడాది కాలంగా ఐటీ కంపెనీలపై ఒత్తిడి పెరుగుతోంది. ఈ ఎఫెక్ట్‌‌‌‌ లోకల్ ఐటీ కంపెనీలపై కూడా తీవ్రంగా ఉంది. కరోనా  వలన గ్లోబల్‌‌‌‌గా ఐటీ కంపెనీలకు డిమాండ్ పెరిగిందని, లాంగ్‌‌‌‌ టర్మ్‌‌‌‌లో టెక్ కంపెనీలు వృద్ధి చెందుతాయని ఇండస్ట్రీ వర్గాలు  చెప్పుకొస్తున్నాయి. అయినప్పటికీ రెండేళ్ల కిందటితో పోలిస్తే  తమకు జాబ్స్‌‌‌‌ ఇచ్చిన కంపెనీలపై ఉద్యోగుల్లో నమ్మకం తగ్గిందని స్టడీ ఒకటి వెల్లడించింది. ఎప్పుడు  జాబ్స్ నుంచి తీసేస్తారా? అనే భయాలు ఎక్కువయ్యాయని వివరించింది.  ఐటీ సర్వీసెస్‌‌‌‌ అండ్ మేనేజ్‌‌‌‌మెంట్ కంపెనీ మేనేజ్‌‌‌‌ఇంజిన్‌‌‌‌ చేసిన సర్వే ప్రకారం, 53  శాతం మంది ఐటీ ఉద్యోగులు మరొ కొత్త జాబ్‌‌‌‌ కోసం యాక్టివ్‌‌‌‌గా వెతుకుతున్నారు. ఇందులో 52 శాతం మంది లాయల్టీ  రెండేళ్ల కిందటితో పోలిస్తే  తగ్గింది. గ్లోబల్‌‌‌‌గా 49 శాతం మంది రెస్పాండెంట్లకు తమ ఎంప్లాయర్స్‌‌‌‌పై నమ్మకం తగ్గింది. గత రెండేళ్లలో   ఆర్గనైజేషన్లు తమను కరెక్ట్‌‌‌‌గా పట్టించుకోలేదని 82 శాతం మంది రెస్పాండెంట్లు పేర్కొన్నారు. గ్లోబల్‌‌‌‌గా ఈ నెంబర్ 70 శాతంగా ఉంది.  రెండేళ్ల క్రితంతో పోలిస్తే 67 శాతం మంది తమ కెరీర్‌‌‌‌‌‌‌‌ను రిస్క్‌‌‌‌ చేయడానికి రెడీగా ఉన్నారని ఈ సర్వే వెల్లడించింది. గ్లోబల్‌‌‌‌గా 65 శాతం మంది రిస్క్‌‌‌‌ చేయడానికి సిద్ధంగా ఉన్నారు.  దేశంలోని 300 మంది ఐటీ, ఇతర కీలక బిజినెస్‌‌‌‌ల ఉద్యోగులను, గ్లోబల్‌‌‌‌గా 3,300 మందిని ఇంటర్వ్యూ చేసి ఈ సర్వేను రెడీ చేశామని మేనేజ్‌‌‌‌ఇంజిన్ పేర్కొంది. ఈ సర్వే వివరాలను ఐటీ పాత్ర, టెక్నాలజీని కంట్రోల్ చేయడం, ఐటీ ఫ్యూచర్‌‌‌‌‌‌‌‌ అనే మూడు అంశాల కింద విడుదల చేసింది.

హైబ్రిడ్ వర్క్ విధానానికి మొగ్గు..

ఐటీ, నాన్ ఐటీ కంపెనీలు హైబ్రిడ్ వర్క్ (వర్క్ ఫ్రమ్ హోమ్‌‌‌‌, ఆఫీస్‌‌‌‌)  విధానానికి మొగ్గు చూపుతున్నారని ఈ సర్వే వెల్లడించింది. గత రెండేళ్లలో ఐటీ, ఇతర బిజినెస్‌‌‌‌ల మధ్య భాగస్వామ్యం పెరిగిందని 91 శాతం మంది  బిజినెస్‌‌‌‌, టెక్నాలజీ లీడర్లు వెల్లడించారు. ఫ్లెక్సిబుల్ వర్క్ మోడల్‌‌‌‌ను తీసుకొచ్చేటప్పుడు తమను సంప్రదించారని 76 శాతం మంది రెస్పాండెంట్లు పేర్కొన్నారు. ఇది గ్లోబల్ యావరేజ్ అయిన 64 శాతం కంటే 12 శాతం ఎక్కువ. ఈ సర్వే ప్రకారం, 53 శాతం ఐటీ కంపెనీలు తమ ఐటీ ఇన్‌‌‌‌ఫ్రాస్ట్రక్చర్‌‌‌‌‌‌‌‌ను సక్సెస్‌‌‌‌ఫుల్‌‌‌‌గా డీసెంట్రలైజ్ (ఒకే చోట కాకుండా ఇన్‌‌‌‌ఫ్రాస్ట్రక్చర్‌‌‌‌‌‌‌‌ను వేరు వేరు చోట్ల ఏర్పాటు చేయడం) చేసుకున్నాయి.  దీంతో నాన్ ఐటీ డిపార్ట్‌‌‌‌మెంట్లు కూడా ప్రయోజనం పొందాయని ఈ సర్వే తెలిపింది.  2020 తో పోలిస్తే 68 శాతం మంది నాన్ ఐటీ ఉద్యోగులకు ఐటీపై నాలెడ్జ్‌‌‌‌ పెరిగింది. సైబర్ అటాక్స్‌‌‌‌ నుంచి రక్షణ పొందేందుకు  సెక్యూరిటీ విషయంలో మార్పులు రావాల్సి ఉందని 85 శాతం మంది రెస్పాండెంట్లు వివరించారు. ఏఐ, ఎంఎల్ వంటి టెక్నాలజీలపై భారీగా ఇన్వెస్ట్ చేయడం ద్వారా  ఆర్గనైజేషన్లను సైబర్‌‌‌‌‌‌‌‌ అటాక్స్‌‌‌‌ నుంచి కాపాడొచ్చని 91 శాతం  మంది పేర్కొన్నారు.