ఎప్ సెట్ ​కన్వీనర్​గా దీన్ కుమార్

ఎప్ సెట్ ​కన్వీనర్​గా దీన్ కుమార్
  •     ఐసెట్​కు నర్సింహాచారి, పీజీఈసెట్​కు అరుణకుమారి 
  •     ప్రవేశ పరీక్షలకు కన్వీనర్ల నియామకం

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో మే, జూన్ ​నెలల్లో వివిధ కోర్సుల్లో అడ్మిషన్లకు నిర్వహించే పలు ప్రవేశ పరీక్షలకు ఉన్నత విద్యా మండలి శనివారం కన్వీనర్లను నియమించింది. మొత్తం 8 ఎంట్రెన్స్ ఎగ్జామ్స్​కు ఏడుగురు కన్వీనర్లను పెట్టినట్టు కౌన్సిల్ చైర్మన్ ప్రొఫెసర్ లింబాద్రి, సెక్రటరీ శ్రీనివాస్​రావు వెల్లడించారు. టీఎస్​ఎప్ సెట్(ఎంసెట్) కన్వీనర్​గా ప్రొఫెసర్ దీన్ కుమార్(జేఎన్టీయూ), పీజీఈసెట్ కన్వీనర్​గా ప్రొఫెసర్ అరుణకుమారి(జేఎన్టీయూ), ఐసెట్ కన్వీనర్​గా ఎస్.నర్సింహాచారి(కేయూ), ఈసెట్ కన్వీనర్​గా శ్రీరామ్ వెంకటేశ్(ఓయూ), లాసెట్, పీజీఎల్​సెట్ కన్వీనర్​గా విజయలక్ష్మి(ఓయూ), ఎడ్ సెట్ కన్వీనర్ గా మృణాళిని, పీజీసెట్ కన్వీనర్ రాజేశ్ కుమార్(ఓయూ)లను నియమించారు.

కాగా, ఈ ఏడాది కొత్తగా ఐసెట్, పీజీఈసెట్, ఎడ్ సెట్ కన్వీనర్లను మార్చారు. గతేడాది ఎడ్ సెట్ కన్వీనర్ గా పనిచేసిన ప్రొఫెసర్ రిటైర్డ్ కావడంతో, కొత్తవారికి అవకాశం ఇచ్చారు. త్వరలోనే అన్ని ప్రవేశ పరీక్షలకు సంబంధించిన పనులు ప్రారంభమవుతాయని అధికారులు చెప్పారు. సెట్స్ చైర్మన్లుగా ఉన్న వీసీలు.. కన్వీనర్లతో సమన్వయం చేసుకొని సెట్ కమిటీలు వేసుకోవాలని సూచించారు. కాగా, రెండ్రోజుల క్రితమే ప్రవేశపరీక్షలకు సంబంధించి షెడ్యూల్​ను సర్కారు ప్రకటించిన విషయం తెలిసిందే.