దీపిక కండిషన్స్కు దిమ్మతిరగాల్సిందే..?

దీపిక కండిషన్స్కు దిమ్మతిరగాల్సిందే..?

‘కల్కి 2898 ఏడీ’ చిత్రంలో ప్రభాస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌తో కలిసి నటించిన దీపిక పదుకొనె.. ‘స్పిరిట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌’ కోసం మరోసారి తనతో కలసి స్క్రీన్ షేర్ చేసుకోబోతున్న విషయం తెలిసిందే. అయితే ఇప్పుడు ఈ సినిమా నుంచి దీపికను తప్పించి, మరో హీరోయిన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కోసం చూస్తున్నారట దర్శకనిర్మాతలు. ఆమె పెట్టిన అన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ రీజనబుల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కండిషన్సే ఇందుకు కారణమని, ఆ షరతులకు దర్శకుడు సందీప్ రెడ్డి వంగా షాక్ అయ్యాడని ముంబై ఇన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌సైడ్ రిపోర్ట్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చెబుతున్నాయి.  

రోజుకు ఎనిమిది గంటలు మాత్రమే వర్కింగ్ టైమ్ అని, అందులో రెండు గంటలు ప్రయాణానికి పోగా మరో ఆరు గంటలు సెట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో ఉంటానని చెప్పిందట. రూ.20 కోట్లు ఆమె రెమ్యునరేషన్ కాగా,  వందరోజుల్లో తన పార్ట్ షూటింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ పూర్తవ్వకపోతే ఆ తర్వాత షూట్ జరిగే ప్రతి రోజుకు అదనంగా రెమ్యునరేషన్ చెల్లించాలనేది మరో కండీషన్.  ఇక తెలుగులో డైలాగ్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చెప్పనని కూడా కండిషన్ పెట్టిందట.

ఇన్ని రూల్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌తో షూటింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చేయడం జరిగే వ్యవహారం కాదని భావించిన సందీప్ రెడ్డి.. ఆమెతో కాంట్రాక్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ రద్దు చేసుకుని మరో హీరోయిన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను ఎంపిక చేసే పనిలో పడ్డట్టు తెలుస్తోంది. ఈ విషయంలో దీపికపై కొన్ని విమర్శలు వస్తున్నా, ఆమెను సపోర్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చేసేవాళ్లు కూడా లేకపోలేదు. ఇటీవల తల్లయిన దీపిక.. తన పాపతో ఎక్కువ సమయం గడిపేందుకు ఇలాంటి రూల్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ పెడుతోందని సమర్దిస్తున్నారు.

 ఏదేమైనా ప్రభాస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు జంటగా దీపికను చూద్దామనుకున్న అభిమానులకు నిరాశ తప్పేలా లేదు.  ఇక ప్రస్తుతం ఆమె షారుఖ్ ‘కింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌’తో పాటు సంజయ్ లీలా భన్సాలి ‘లవ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ అండ్ వార్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌’ చిత్రాల్లో నటిస్తోంది. ‘కల్కి’ సీక్వెల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో నటించాల్సి ఉంది.