Deepika Padukone BAFTA 2024: బ్రిటిష్‌ అకాడమీ వేదికపై దీపికా పదుకొణె ప్రసంగం

Deepika Padukone BAFTA 2024:  బ్రిటిష్‌ అకాడమీ వేదికపై దీపికా పదుకొణె ప్రసంగం

నార్త్ బ్యూటీ దీపికా పదుకొణె (Deepika Padukone) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. బాలీవుడ్ లో క్రేజీ ప్రాజెక్టులు చేస్తూ ఫుల్ బిజీగా ఉంది ఈ బ్యూటీ. పాన్ ఇండియా కమర్షియల్ సినిమాలకు కేరాఫ్ గా మారిపోయింది. అంతేకాదు 2023 ఆస్కార్ అకాడమీ అవార్డుల కార్యక్రమంలో వ్యాఖ్యాతలలో ఒకరుగా ఇంటర్నేషనల్ వైడ్ గా ఎంతో ఫేమస్ అయ్యారు. ఆస్కార్ వేదికపై RRR మూవీకి అవార్డు ప్రకటించే ముందు తన ప్రసంగంతో భారతదేశాన్ని గర్వించేలా చేసింది. 

లేటెస్ట్గా దీపికా పదుకొణె మరో అరుదైన గౌరవాన్ని సొంతం చేసుకున్నారు. లండన్‌లోని రాయల్‌ ఫెస్టివల్‌ హాల్‌లో 77వ BAFTA అవార్డుల ప్రదానోత్సవం (ఫిబ్రవరి 18న) ఎంతో గ్రాండ్ గా జరిగింది. బ్రిటిష్‌ అకాడమీ ఫిల్మ్‌ అండ్‌ టెలివిజన్‌ ఆర్ట్స్‌ (BAFTA) అవార్డుల కార్యక్రమంలో ఆమె ప్రజెంటర్‌గా వ్యవహరించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఏకైక ఇండియా నటి దీపికా పదుకొణె కావడం విశేషం.

ఈ ప్రతిష్టాత్మక కార్యక్రమంలో దీపిక పదుకొణె భారతీయత ఉట్టిపడేలా సబ్యసాచి చీరలో..చెవి రింగులతో  కనిపించి అందరినీ ఆకర్షితులని చేసింది.‘బెస్ట్‌ ఫిల్మ్‌ నాట్‌ ఇన్‌ ఇంగ్లిష్‌ లాంగ్వేజ్‌’ కేటగిరీలో ఆమె అవార్డును ప్రదానం చేశారు. ఇందుకు సంబంధించిన పొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి. రియల్ ఇండియన్‌ క్వీన్‌ అంటూ నెటిజన్లు కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. 

ఇక దీపికా ప్రస్తుతం చేస్తున్న ప్రెస్టిజియస్ ప్రాజెక్టులలో ప్రభాస్ హీరోగా వస్తున్న కల్కి 2898 AD మూవీ ఒకటి. దాదాపు రూ.500 కోట్ల బడ్జెట్ తో పాన్ ఇండియా లెవల్లో వస్తున్న ఈ సినిమాను టాలెంటెడ్ డైరెక్టర్ నాగ్ అశ్విన్ తెరకెక్కిస్తున్నాడు. 
 

కల్కి సినిమా కోసం దీపికా ఏకంగా రూ.20 కోట్లు పోరితోషికంగా అందుకుంటుందట. గతంలో ఒక్కో సినిమాకు రూ.12 నుండి  రూ.15 కోట్ల వరకు తీసుకున్న దీపికా.. కల్కి కోసం రూ.20 కోట్లు తీసుకోవడం హాట్ టాపిక్గా మారింది.