Rashmika Mandanna: చావు నుంచి బయటపడ్డాను.. వైరల్ అవుతున్న రష్మిక ఇన్స్టా పోస్ట్

Rashmika Mandanna: చావు నుంచి బయటపడ్డాను.. వైరల్ అవుతున్న రష్మిక ఇన్స్టా పోస్ట్

స్టార్ హీరోయిన్ రష్మిక మందన్న(Rashmika Mandanna) పెద్ద ప్రమాదం నుంచి బయటపడింది. ఆమె ప్రయానిస్తున్న విమానం అత్యవసరంగా ల్యాండ్ అయింది. ఫ్లైట్ లో సాంకేతిక సమస్య తలెత్తడంతో విమానాన్ని ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేశారు అధికారులు. వరుస షూటింగ్ లతో బిజీగా ఉన్న రష్మిక.. ముంబై నుంచి హైదరాబాద్‌కు విమానంలో బయలుదేరింది.ఫ్లైట్‌ టేకాఫ్ అయిన 30 నిమిషాలకే అందులో సాంకేతిక సమస్య తలెత్తింది. దీంతో విమానం ముంబైకి తిరిగి వచ్చింది. ఈ ఫ్లైట్‌లో రష్మికతో పాటు శ్రద్ధా దాస్ కూడా ఉంది. ఘటనలో ఎవరికీ గాయాలు కాలేదు.

ఇదే విషయాన్ని రష్మిక ఇన్ స్టాలో పోస్ట్ చేసింది. ఇవాళ చావు నుంచి బయడపడినట్లు రాసుకొచ్చింది. ఫ్లైట్ లో శ్రద్దా(Shradha)తో కలిసి ఉన్న ఫొటోను షేర్ చేసింది. దీంతో రష్మిక అభిమానులంతా ఏం జరిగిందంటూ కామెంట్స్ చేస్తున్నారు. ప్రస్తుతం ఈ పోస్ట్ సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారింది. పుష్ప(Pushpa) సినిమాతో నేషనల్ క్రష్ గా పేరు తెచ్చుకున్న రష్మిక మందన్న.. వరుస సినిమాలతో బిజీబిజీగా ఉంది. రీసెంగా విడుదలైన యానిమల్ సినిమాతో ఈ బ్యూటీ బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది. ప్రస్తుతం పుష్ప 2, గర్ల్ ఫ్రెండ్ చిత్రాలతో మరికొన్ని సినిమాల్లో నటిస్తోంది.