
మాజీ నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో (NCB) అధికారి సమీర్ వాంఖెడేకు ఢిల్లీ హైకోర్టులో ఊహించని షాక్ తగిలింది. బాలీవుడ్ సూపర్‌స్టార్ షారుక్ ఖాన్, ఆయన తనయుడు ఆర్యన్ ఖాన్‌లపై వాంఖెడే దాఖలు చేసిన పరువు నష్టం దావా పిటిషన్‌ను ను ఢిల్లీ హైకోర్టు ఈరో జు ( శుక్రవారం ) తిరస్కరించింది. ఆర్యన్ ఖాన్ రచన, దర్శకత్వంలో నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ అవుతున్న వెబ్ సిరీస్ 'ది బార్డ్స్ ఆఫ్ బాలీవుడ్' (The Ba***rds of Bollywood) ద్వారా తనను అప్రతిష్ట పాలు చేశారని వాంఖెడే తన ఫిర్యాదులో ఆరోపించారు. అయితే, ఈ కేసులో 'కాజ్ ఆఫ్ యాక్షన్' ఢిల్లీలో జరగలేదు అనే కీలక కారణంతో కోర్టు ఈ ఫిర్యాదును కొట్టివేసింది.
కేసు తిరస్కరణకు కారణాలు ఏంటి?
జస్టిస్ పురుషైంద్ర కుమార్ కౌరవ్ సమక్షంలో ఈ కేసు విచారణ జరిగింది. వాంఖెడే తరఫు న్యాయవాది సందీప్ సేథి వాదనలు వినిపిస్తూ, ఈ వెబ్ సిరీస్ ఢిల్లీతో సహా దేశవ్యాప్తంగా అన్ని నగరాల కోసం రూపొందించబడింది కాబట్టి, ఢిల్లీలో తమకు పరువు నష్టం జరిగిందని తెలిపారు. ఢిల్లీలోని ప్రజలు కూడా వాంఖెడేకు వ్యతిరేకంగా మీమ్స్ రూపొందించారని, అందుకే తాము ఢిల్లీ హైకోర్టులో దావా వేశామని కోర్టుకు వివరించారు. అయితే న్యాయమూర్తి ఈ వాదనతో న్యాయస్థానం ఏకీభవించలేదు. సమీర్ వాంఖేడ్ పిటిషన్ ను తిరస్కరించింది. ఒకవేళ దేశంలోని వివిధ ప్రదేశాలతో పాటు ఢిల్లీలో కూడా తనకు తీవ్ర నష్టం జరిగిందని మీరు నిరూపించగలిగితే, అప్పుడు దీనిని ఢిల్లీలో విచారించేందుకు పరిగణించేవాళ్లం అని కోర్టు స్పష్టం చేసింది.
సివిల్ ప్రొసీజర్ కోడ్ (CPC)లోని సెక్షన్ 9ని ఉదహరిస్తూ, ఈ సివిల్ దావా ఢిల్లీలో ఎలా చెల్లుబాటు అవుతుందో సరిగ్గా వివరించలేదని న్యాయమూర్తి వ్యాఖ్యానించారు. దీంతో వాంఖెడే తరఫు న్యాయవాది, అవసరమైన సవరణలు చేయడానికి కొంత సమయం కోరగా, కోర్టు వారికి కేసును సవరించుకునేందుకు అనుమతి ఇచ్చింది.
వాంఖెడే ఆరోపణలు
వాంఖెడే తన దావాలో ఈ వెబ్ సిరీస్‌లోని ఒక పాత్రను తన పోలికతో సృష్టించి, దాన్ని అప్రతిష్టపాలు చేసే విధంగా చూపించారని ఆరోపించారు. ఈ సిరీస్ మాదకద్రవ్యాల నిరోధక సంస్థల గురించి తప్పుడు, ప్రతికూల చిత్రాన్ని ప్రచారం చేస్తోంది. ఇది చట్టాన్ని అమలు చేసే సంస్థలపై ప్రజల విశ్వాసాన్ని దెబ్బతీస్తుంది అని ఫిర్యాదులో పేర్కొన్నారు. అంతేకాకుండా కొన్ని అభ్యంతరకమైన సన్నివేశాలు కూడా ఉన్నాయి. ఈ చర్య'ప్రివెన్షన్ ఆఫ్ ఇన్‌సల్ట్స్ టు నేషనల్ హానర్ యాక్ట్, 1971'లోని నిబంధనలను తీవ్రంగా ఉల్లంఘించడమే అని, దీనికి శిక్షార్హమైన పరిణామాలు ఉంటాయని వాంఖెడే వాదించారు.
కాగా, 2021లో ముంబై తీరంలో జరిగిన డ్రగ్స్ కేసులో ఆర్యన్ ఖాన్‌ను అరెస్టు చేసిన అధికారి సమీర్ వాంఖేడేనే. అయితే, తదుపరి విచారణలో ఆర్యన్ ఖాన్‌కు క్లీన్ చిట్ లభించింది. ఇప్పుడు ఈ కేసును వాంఖెడే తగిన విధంగా సవరించి మళ్లీ కోర్టును ఆశ్రయించే అవకాశం ఉంది.