దేశాన్ని షిప్‌ బిల్డింగ్‌ హబ్‌గా మార్చాలె

దేశాన్ని షిప్‌ బిల్డింగ్‌ హబ్‌గా మార్చాలె

దేశాల మధ్య ఆర్థిక, రాజకీయ, వాణిజ్య సంబంధాలు ఒడిదొడుకులకు లోనవుతున్నాయన్నారు రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్. ఈ ప్రభావం మనదేశంపైనా ఉంటుందన్నారు. అయితే ఈ సవాళ్ల సమయం అవకాశాలు కూడా ఇస్తుందన్నారు. వచ్చే రెండేళ్లలో రక్షణ రంగంపై 2.1 ట్రిలియన్ డాలర్లను ప్రపంచం ఖర్చు చేయనుందని రిపోర్ట్ చెబుతోందన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో పూర్తి సామర్థ్యాలను వినియోగించుకుని... దేశాన్ని షిప్ బిల్డింగ్ హబ్ గా మార్చాలన్నారు. చెన్నైలో కోస్ట్ గార్డ్ ఆఫ్ షోర్ వెస్సెల్ ‘విగ్రహ’ను రాజ్ నాథ్ సింగ్ జాతికి అంకితం చేశారు. కోస్ట్ గార్డ్ షిప్‌ను ప్రారంభించిన తర్వాత ఆయన మాట్లాడుతూ మన దేశ తీర ప్రాంత రక్షణలో విగ్రహ కీలక పాత్ర పోషిస్తుందని అన్నారు. ఈ కోస్ట్ గార్డ్ షిప్ ‘విగ్రహ’ పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించిదని, దీని ద్వారా భారత్ ఆత్మనిర్భరతకు ఇది సాక్ష్యమని చెప్పారు.

భారత్‌కు ఉన్న తీర ప్రాంత రక్షణ షిప్‌లలో ఇది ఏడో ఆఫ్‌షోర్‌‌ ప్యాట్రోల్‌ (ఓపీవీ) వెసల్‌. విక్రమ్‌, విజయ్‌, వీర్‌‌, వరాహ, వరద్‌, వజ్ర తర్వాత ఇప్పుడు విగ్రహను రక్షణ శాఖ కోస్ట్‌ గార్డుకు అందించింది. విగ్రహను ఎల్‌ అండ్‌ టీ షిప్‌ బిల్డింగ్‌ లిమిటెడ్‌ కంపెనీ నిర్మించింది.