
పాకిస్తాన్ ఉగ్రవాద స్థావరాలపై భారత దళాలు పంజా విసిరాయి.. పాక్ ఉగ్రస్తావరాలే లక్ష్యంగా చేసుకుని భారత్ మెరుపు దాడులు చేసింది భారత్. మంగళవారం ( మే 6 ) తేది అర్థరాత్రి దాటాకా పీవోకేతోపాటు పాక్ లోని 9 టెర్రరిస్ట్ స్థఆవరాలపై ఇండియన్ ఎయిర్ ఫోర్స్ మిసైళ్లతో అటాక్ చేసింది భారత్. ఇదిలా ఉండగా.. ఆపరేషన్ సింధూర్ తర్వాత పరిణామలపై త్రివిధ దళాల అధిపతులతో రక్షణ శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ సమీక్ష జరిపారు. బుధవారం ( మే 7 ) ఉదయం 10 గంటలకు రక్షణ శాఖ అధికారుల మీడియా సమావేశం నిర్వహించనున్నట్లు తెలిపారు.ఈ సమావేశంలో దాడి కి సంబందించిన వివరాలను వెల్లడించనున్నారు అధికారులు.
ఈ దాడి ద్వారా భారతపై కుట్రపన్నినట్లు భావిస్తున్న మొత్తం 9 టెర్రరిస్ట్ బేస్ లను నేటమట్టం చసింది. పీవోకేలోని ఉగ్రస్థావరాలపై జరిపిన దాడుల్లో 12 మంది టెర్రరిస్టులు మృతి చెందారని 55 మంది గాయపడ్డారని భారత ప్రభుత్వం ప్రకటించింది.ఆపరేషన్ సింధూర్ ఖచ్చితమైన లక్ష్యంతో కూడినదని భారత రక్షణ మంత్రిత్వశాఖ స్పష్టం చేసింది. పాకిస్తాన్ లోని ఏ సైనిక స్థావరంపైనా దాడి జరగలేదని తెలిపింది. టెర్రరిస్ట్ బేస్ లను గుర్తించి దాడి చేశామని చెప్పింది. ఈ విషయంలో భారత్ అత్యంత సంయమనంతో వ్యవహహరించిందని తెలిపింది.
‘ఆపరేషన్ సిందూర్’ పేరుతో ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ప్రత్యేక ఆపరేషన్ చేపట్టింది. మంగళవారం అర్ధరాత్రి దాటిన తర్వాత ఐఏఎఫ్ యుద్ధ విమానాలు గాల్లోకి లేచాయి. ముందుగా సేకరించిన సమాచారంతో పీవోకే, పాకిస్తాన్ లోని తొమ్మిది టెర్రర్ క్యాంపుల వైపు దూసుకెళ్లాయి. పక్కా ప్లానింగ్ తో టెర్రర్ క్యాంపులపై బాంబులు జారవిడిచి వెనుదిరిగాయి.
ఇదంతా మెరుపు వేగంతో జరిగిపోయింది. పాక్ సైన్యం గుర్తించి ప్రతిస్పందించేలోగా ఐఏఎఫ్ ఫైటర్ జెట్లు తిరిగొచ్చేశాయి. అత్యాధునిక సాంకేతిక సాయంతో గురిచూసి వదిలిన మిసైల్స్ టెర్రర్ క్యాంపులను పేల్చేశాయి. ఇండియన్ ఆర్మీ దాడులు చేసిన కాసేపటికే సోషల్ మీడియాలో వీడియోలు ప్రత్యక్షమయ్యాయి. పాక్ పౌరులు ఈ దాడులను తమ ఫోన్లలో రికార్డు చేసి ట్విట్టర్ లో పోస్టు చేశారు.