
భారత రక్షణ శాఖ తన అత్యంత ప్రధానమైన ఒప్పందాల్లో ఒక దానిని హిందూస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ (HAL)తో కుదుర్చుకుంది. ఈ డీల్ విలువ అక్షరాలా రూ.62వేల 370 కోట్లుగా ఉంది. ఈ ఒప్పందం ద్వారా ఇండియన్ ఎయిర్ ఫోర్స్ కోసం హెచ్ఏఎల్ నుంచి 97 లైట్ కాంబ్యాట్ ఎయిర్‌క్రాఫ్ట్ తేజస్ Mk-1A జెట్ విమానాలను కొనుగోలు జరగనుంది.
ఈ 97 జెట్లలో 68 సింగిల్-సీటర్ ఫైటర్లు.. అలాగే 29 ట్విన్-సీటర్ ట్రైనర్ విమానాలు ఉంటాయి. ఈ విమానాల డెలివరీలు 2027-28 నుండి ప్రారంభమై.. వరుసగా ఆరు సంవత్సరాల్లో పూర్తి చేయనున్నట్లు రక్షణ శాఖ తెలిపింది. ఈ Mk-1A వెర్షన్ 64 శాతం కన్నా ఎక్కువ స్వదేశీ భాగస్వామ్యంతో రూపుదిద్దబడింది.
MoD signed a contract with @HALHQBLR for 97 LCA Mk1A aircraft (68 Fighters & 29 Twin Seaters) with associated equipment for the IAF at Rs 62,370 Cr (excl. taxes) under Buy (India-IDDM), today in New Delhi. The advanced LCA Mk1A integrates UTTAM AESA #Radar, Swayam Raksha Kavach &… pic.twitter.com/Bwm8WlsITq
— Ministry of Defence, Government of India (@SpokespersonMoD) September 25, 2025
ఈ ఫైటర్లలో UTTAM AESA రాడార్, స్వయం రక్ష కవచ్ ఎలక్ట్రానిక్ వార్ ఫేర్ సిస్టం, నియంత్రణ ఉపకరణాలు వంటి వ్యవస్థలను ఉండనున్నాయి. ఈ ఒప్పందం భారతదేశంలో అతిముఖ్యమైన 'ఆత్మనిర్భర్ భారత్' ప్రయత్నాలను బలపరచనుంది. ఈ ప్రాజెక్టు ద్వారా వేలాది ఉద్యోగాలు సృష్టితో పాటు సుమారు 105 భారతీయ కంపెనీలు భాగస్వామ్యం కానున్నాయని వెల్లడైంది.
ALSO READ : అమెరికా వద్దంటోండి.. టెక్ నిపుణులను రమ్మంటూ జర్మనీ, యూకే, కెనడా జాబ్ ఆఫర్లు..!
తేజస్ Mk-1A జెట్ విమానాలు భారత ఎయిర్ ఫోర్స్‌లోని పాత మిగ్-21 ఎయిర్ క్రాఫ్ట్‌లను మరింత ఆధునిక, నమ్మకమైన ఫైటర్లతో భర్తీ చేస్తాయి. ఈ ఒప్పందం భారత రక్షణ రంగంలో స్వదేశీ తయారీని మరింత ప్రోత్సహించడమే కాకుండా.. దేశీయ ఎరోస్పేస్ పరిశ్రమకు భారీ ప్రోత్సాహకంగా నిలుస్తుందని పరిశ్రమ వర్గాలు చెబుతున్నాయి.