
Bharat Electronics Stock: భారత్ పాక్ ఉగ్రవాద మూకలను మట్టికరిపించేందుకు చేపట్టిన ఆపరేషన్ సిందూర్ భారత్ చాపకింద నీరుల స్వదేశీ ఆయుధాలను, మిలిటరీ టెక్నాలజీని ఏస్థాయిలో అభివృద్ధి చేసుకుంటుందనే విషయాలను బయటపెట్టింది. ఈ క్రమంలో ఏఐ టెక్నాలజీ నుంచి అత్యాధునికి శాటిలైట్ వ్యవస్థల వరకు ఎలా మిళితమై పనిచేశాయో ప్రపంచం చూసింది. అయితే వీటి వెనుక ఉన్న భారతీయ డిఫెన్స్ కంపెనీల షేర్లకు పెరుగుతున్న డిమాండ్ ఇన్వెస్టర్లకు డబ్బుల వర్షం కురిపిస్తోంది.
ఇప్పుడు మనం మాట్లాడుకోబోతున్నది భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ కంపెనీ షేర్ల గురించే. డిఫెన్స్ రంగంలో కంపెనీ తయారు చేసిన అనేక ప్రాజెక్టులతో పాటు ఆకాష్ తీర్ టెక్నాలజీ కంపెనీపై పెట్టుబడిదారులకు నమ్మకాన్ని భారీగా పెంచేస్తోంది. నేడు ఇంట్రాడేలో కంపెనీ షేర్లు ఒక్కోటి రూ.385 స్థాయి వద్ద ట్రేడింగ్ కొనసాగిస్తోంది. పైగా నేడు స్టాక్ తన సరికొత్త జీవితకాల గరిష్ఠమైన రూ.389.90ని తాకింది. అయితే కంపెనీ షేర్లు గడచిన దశాబ్ధకాలంలో ఇన్వెస్టర్ల జీవితాలను మార్చేసింది.
పదేళ్ల కిందట మే 29, 2015న కంపెనీ షేర్ల ధర ఒక్కోటి కేవలం రూ.36.19 వద్ద ఉన్న సంగతి తెలిసిందే.. అయితే నేడు ఇంట్రాడేలో స్టాక్ గరిష్ఠంగా రూ.390కి చేరుకుంది. పైగా మూడు సార్లు ఈ మధ్య కాలంలో పెట్టుబడిదారులకు బోనస్ షేర్లను కూడా అందించింది. ఎవరైనా ఇన్వెస్టర్ 2015లో లక్ష రూపాయలు పెట్టుబడి పెట్టి ఉంటే వారికి 27వేల 324 షేర్లు ఉండేవి.. వారు ఆ పెట్టుబడిని ఇప్పటి వరకు కొనసాగించి ఉంటే ప్రస్తుత మార్కెట్ విలువ ప్రకారం అప్పటి లక్ష రూపాయల విలువ ఏకంగా రూ.కోటి 06లక్షలు అయ్యి ఉండేది. అందుకే దీర్ఘకాలంలో పెట్టుబడి అందించే ఫలితాలు ఊహించని స్థాయిలో ఉంటాయని నిపుణులు చెబుతుంటారు.
బ్రోకరేజీల మాట ఇదే..
* ప్రముఖ బ్రోకరేజ్ సంస్థ యూబీఎస్ భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ షేర్ టార్గెట్ ధరను రూ.450కి పెంచింది.
* అమెరికాకు చెందిన సంస్థ జేపీ మోర్గన్ భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ షేర్లకు రూ.445 టార్గెట్ ధరను ప్రకటించింది.
పైగా కంపెనీ షేర్లను ట్రాక్ చేస్తున్న 29 మంది నిపుణుల్లో 25 మంది కంపెనీ షేర్లకు బై రేటింగ్ అందించటంతో డిఫెన్స్ స్టాక్ డిమాండ్ అమాంతం మార్కెట్లో పెరిగిపోతోంది.
NOTE: పైన అందించిన వివరాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. వీటి ఆధారంగా ఎలాంటి పెట్టుబడి నిర్ణయాలు తీసుకోకండి. స్టాక్ మార్కెట్లు, మ్యూచువల్ ఫండ్స్, క్రిప్టోల్లో పెట్టుబడులు నష్టాలతో కూడుకున్నవి. ఏదైనా పెట్టుబడి నిర్ణయం తీసుకోవటానికి ముందుగా మీ ఆర్థిక సలహాదారులను సంప్రదించటం ఉత్తమం. మీరు తీసుకునే నిర్ణయాలకు V6 యాజమాన్యం లేదా ఉద్యోగులు ఎట్టిపరిస్థితుల్లోనూ బాధ్యత వహించరు.