జేమ్స్ బాండ్ 25 వ ఫిల్మ్ ‘నో టైమ్ టు డై’ లో వాడిన ల్యాండ్ రోవర్ డిఫెండర్ వీ8 ను ఇన్‌స్పిరేషన్‌గా తీసుకొని ‘డిఫెండర్ బాండ్ ఎడిషన్’ ను జాగ్వార్ ల్యాండ్ రోవర్ (జేఎల్‌ఆర్) గురువారం లాంచ్ చేసింది. ఈ నెల చివరిలో జేమ్స్ బాండ్ మూవి రిలీజ్ కాబోతోంది. కేవలం 300 వెహికల్స్‌ను మాత్రమే కంపెనీ అందుబాటులోకి తెచ్చింది. డిఫెండర్ 110 లేదా 90 కింద ఈ వెహికల్‌ను ఆర్డర్ పెట్టుకోవచ్చు. ఈ వెహికల్ బ్యాక్ సైడ్ ‘డిఫెండర్ 007’ అని ఉంటుంది. ఈ బాండ్ ఎడిషన్‌లో 5 లీటర్ల సూపర్ ఛార్జ్‌డ్ పెట్రోల్ ఇంజిన్ ఉంది.
