
భారత రక్షణ మంత్రిత్వ శాఖ నుంచి మరో జాబ్ నోటిఫికేషన్ విడుదలైంది. ట్రేడ్స్ మెన్, జేఓఏ, మెటీరియల్ అసిస్టెంట్, ఎంటీఎస్, ఫైర్ మెన్ పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి అప్లికేషన్స్ కోరుతోంది.
ఖాళీలు: 458
పోస్టులు: ట్రేడ్స్మెన్మేట్, జేఓఏ, మెటీరియల్ అసిస్టెంట్, ఎంటీఎస్, ఫైర్మెన్.
ట్రేడ్స్ మెన్ మేట్: ఈ విభాగంలో 330 పోస్టులున్నాయి. పదో తరగతి పాసైన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు.
ఎంటీఎస్: ఈ విభాగంలో మొత్తం 11 ఖాళీలు ఉన్నాయి. పదో తరగతి పాసైన అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు.
ఫైర్ మెన్: ఈ విభాగంలో 64 ఖాళీలున్నాయి. పదో తరగతి పాసైన అభ్యర్థులు ఈ పోస్టులకు అప్లై చేసుకోవచ్చు.
ఏబీఓయూ ట్రేడ్స్ మెన్ మేట్: మొత్తం 14 ఖాళీలు ఉన్నాయి. పదోతరగతి ఉత్తీర్ణులైన వారు అర్హులు.
జేఓఏ: ఈ విభాగంలో 20 ఖాళీలున్నాయి. ఇంటర్మీడియట్ పాసైన వారు అప్లై చేసుకోవచ్చు. .
మెటీరియల్ అసిస్టెంట్: ఇందులో 19 ఖాళీలున్నాయి. గ్రాడ్యుయేషన్ పాసైన అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు.
దరఖాస్తులు: ఆఫ్‌లైన్‌లో అప్లై చేసుకోవాలి.
చివరితేది: ఎంప్లాయిమెంట్ న్యూస్ లో ప్రకటన విడుదలైన 21 రోజుల్లోగా దరఖాస్తు చేసుకోవాలి.
అడ్రస్: కమాండర్, 41 ఫీల్డ్ ఆమ్యునేషన్ డిపో, 909741 సీవో 56 ఏపీఓ.
వెబ్‌సైట్: www.joinindianarmy.nic.in