అడవుల గతి ఇంతేనా?

అడవుల గతి ఇంతేనా?

అడవులు అంతరించిపోకుండా కాపాడటంలో ప్రపంచ దేశాలు ఫెయిల్​ అవుతున్నాయి. చెట్ల కొట్టివేతకు చెక్ పెట్టలేకపోతున్నాయి. డీఫారెస్టేషన్​ను వచ్చే ఏడాది కల్లా సగానికి తగ్గించాలని, 2030 నాటికి పూర్తిగా ఆపాలని ఐదేళ్ల క్రితమే అనుకున్నారు. ఆ దిశగా అడుగులు పడట్లేదు. ‘న్యూయార్క్​ డిక్లరేషన్​ ఆన్​ ఫారెస్ట్స్​’(ఎన్​వైడీఎఫ్​)పై విడుదలైన ఓ అసెస్​మెంట్​ ఈ విషయాన్ని తెలిపింది. ఫారెస్ట్​ల నరికివేత నాన్​ స్టాప్​గా సాగుతోందని, దీనివల్ల ప్రమాదకరమైన వాతావరణ మార్పులను అడ్డుకోలేకపోతున్నామని హెచ్చరించింది.

తెలంగాణ, ఆంధ్ర రాష్ట్రాల్లోని మేజర్​ ప్రొటెక్టెడ్​ ఏరియాలు డీఫారెస్టేషన్​కు, డిగ్రడేషన్​కే గురవుతున్నాయి. ఈ లిస్టులో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్​లలోని టైగర్​ రిజర్వ్​ ప్రాంతాలున్నాయి. తెలంగాణలోని 18.5 శాతం ఫారెస్టులు ప్రస్తుతం అంతరించిపోయే పరిస్థితులను ఎదుర్కొంటున్నాయి. 26.1 శాతం అడవులు ఇప్పటికే చెట్ల నరికివేత, కార్చిచ్చు, ఫ్రాగ్మెంటేషన్​ల వల్ల కనుమరుగయ్యాయి. 1975–2014 మధ్య కాలంలో ఏపీ​ 2,390 స్క్వేర్​ కిలోమీటర్ల ఫారెస్ట్​ ఏరియాను, తెలంగాణ 1,300 స్క్వేర్​ కిలోమీటర్ల అటవీ ప్రాంతాన్ని నష్టపోయాయని నేషనల్​ రిమోట్​ సెన్సింగ్​ సెంటర్ ​(ఎన్​ఆర్​ఎస్​సీ) రీసెర్చ్​లో తేలాయి. అడవుల్లో మంటలు చెలరేగటం తెలుగు రాష్ట్రాలకు పెద్ద సమస్యగా మారింది. 2014లో మొత్తం 3,489 స్క్వేర్​ కిలోమీటర్ల మేర ఫారెస్టులు కార్చిచ్చు వల్ల కాలిబూడిదయ్యాయి. ఇందులో ఏపీకి చెందిన 1,072 స్క్వేర్​ కిలోమీటర్ల అటవీ ప్రాంతం కూడా ఉంది. మంటల్లో తగలబడిపోయిన మొత్తం ఫారెస్ట్​ కవర్​లో దాదాపు 32 శాతం కవ్వాల్​ టైగర్​ రిజర్వ్​ ప్రాంతమేనని ఎన్​ఆర్​ఎస్​సీ రీసెర్చర్లు తెలిపారు.

ఎందుకు నరికేస్తున్నారు?

    పెరుగుతున్న జనాభాకు తగ్గట్లుగా ఇళ్లు కట్టడానికి

    పట్టణాల విస్తీర్ణత, మౌలిక అవసరాల​ కోసం

    కార్పొరేట్​ కల్చర్​ పెరగడంతో ఫర్నీచర్​ కలప కోసం

    రేటు ఎక్కువ పలికే కన్​న్స్యూమర్​ ఐటమ్స్ తయారీ కోసం

    పామాయిల్​ వంటి ముడి సరుకును అందించటానికి

    పశువులకు కావాల్సిన గడ్డి భూములను పెంచడం కోసం అభివృద్ధి చెందని దేశాల్లో వంట చెరుకుగా వాడడానికి.

డీఫారెస్టేషన్కు గురైన ఏరియాలు..

  1. నాగార్జునసాగర్​–శ్రీశైలం టైగర్​ రిజర్వ్​ (దేశంలోనే అతి పెద్ద​ టైగర్​ రిజర్వ్​​)
  2. శ్రీ పెనుశిల నరసింహ శాంక్చువరీ
  3. పాపికొండ శాంక్చువరీ
  4. శ్రీవేంకటేశ్వర శాంక్చువరీ
  5. ఆదిలాబాద్​, నిర్మల్​ జిల్లాల పరిధిలోని కవ్వాల్​ టైగర్​ రిజర్వ్​ ఫారెస్ట్​ సర్కిల్​
  6. ఒడ్డుగూడెం ఫారెస్ట్​ సెక్షన్​
  7. నర్సాపూర్​ వెస్ట్​ ఫారెస్ట్​ సెక్షన్​
    చెట్లు కొట్టేస్తే…

    ఇతర అవసరాల కోసం చెట్లను పర్మినెంట్​గా కొట్టేసి అటవీ భూములను అందుబాటులోకి తెచ్చుకోవటాన్నే డీఫారెస్టేషన్​ అంటారు. ప్రపంచవ్యాప్తంగా ప్రతి ఏడాదీ కోటీ 80 లక్షల​ ఎకరాల్లో ఫారెస్ట్​ నేలమట్టమవుతోందని, ఇది పనామా కంట్రీ సైజ్​తో సమానమని యునైటెడ్​ నేషన్స్​ ఫుడ్​ అండ్​ అగ్రికల్చర్​ ఆర్గనైజేషన్​ తెలిపింది. అడవులు లేకపోవటం వల్ల కలిగే నష్టాలు..

    భూమ్మీద పెరిగే మొక్కలు, జంతువుల్లో 70 శాతం అడవుల్లోనే ఉంటాయి. డీఫారెస్టేషన్​తో అవి షెల్టర్​ కోల్పోతాయి.

    డీఫారెస్టేషన్​ వల్ల క్లైమేట్​లోకి గ్రీన్​హౌస్​​ వాయువులు దాదాపు 15 శాతం అదనంగా రిలీజ్​ అవుతాయి.

    చెట్లు లేకపోతే వాతావరణంలోని వాటర్​ లెవెల్స్​ని, తేమను కంట్రోల్​ చేయటం కష్టం.

    భూమ్మీద చెట్లను నరికేస్తే వానలు పడవు. దీనివల్ల పంటలు పండక కరువు నెలకొంటుంది.

    భారీ వర్షాలు కురిసినప్పుడు భూమ్మీద పెద్ద చెట్లు లేకపోతే నేల కోతకు గురవుతుంది.

    అడవులు లేకపోతే ఈ మోడ్రన్​ ప్రపంచంలో మనిషి లైఫ్​స్టైల్​పైన ఇమ్మిడియెట్​, డైరెక్ట్​ ఎఫెక్ట్​ పడుతుంది.