పిల్లలకు వ్యాక్సిన్ అందుబాటులోకి రావడానికి మరింత ఆలస్యం

పిల్లలకు వ్యాక్సిన్ అందుబాటులోకి రావడానికి మరింత ఆలస్యం

న్యూఢిల్లీ: నెలలు గడుస్తున్నా కరోనా మహమ్మారి వ్యాప్తి మాత్రం తగ్గడం లేదు. వ్యాక్సిన్ ఎప్పుడెప్పుడు అందుబాటులోకి వస్తుందా అని అందరూ ఆశగా ఎదురు చూస్తున్నారు. వీటిని పక్కనెబెడితే.. పిల్లలకు వ్యాక్సిన్‌‌ను అందుబాటులోకి తీసుకురావడానికి ఊహించిన దాని కంటే ఎక్కువ సమయం పడుతుందని మెడికల్ ఎక్స్‌పర్ట్స్ చెబుతున్నారు. కరోనాను పూర్తిగా నియత్రించాలంటే పిల్లలకు వ్యాక్సినేషన్ చేయడం తప్పనిసరి అని పేర్కొంటున్నారు.

‘కొన్ని కరో్నా వ్యాక్సిన్ ట్రయల్స్‌‌లో మాత్రమే పిల్లలు పార్టిసిపెంట్స్‌‌గా ఉన్నారు. వాటిలో ఆక్స్‌‌ఫర్డ్-ఆస్టాజెనెకా ట్రయల్ ఒకటి. చైనా కంపెనీ సినోవాక్ బయోటెక్‌‌ తదుపరి ట్రయల్స్‌‌లో 3 నుంచి 17 ఏళ్ల వయస్సున్న పిల్లలు పార్టిసిపెంట్‌ చేయన్నారు. క్లినికల్ ట్రయల్స్.జీఓవీ ప్రకారం.. చాలా వ్యాక్సిన్ డెవలపర్స్ 18 ఏళ్ల కంటే తక్కువ వయస్సు ఉన్న పార్టిసిపెంట్స్‌‌తో ట్రయల్స్ నిర్వహించడం లేదు. అమెరికాలో కరో్నా వ్యాక్సిన్ ట్రయల్స్‌లో పిల్లలను చేర్చడం లేదు. వ్యాక్సిన్ సేఫ్ అని నిర్ధారించుకున్నాకే పిల్లలకు వ్యాక్సిన్ ట్రయల్స్ నిర్వహించాలని చాలా కంపెనీలు భావిస్తున్నాయి’ అని జస్లాక్ హాస్పిటల్ డైరెక్టర్ డాక్టర్ ఫజల్ నబీ చెప్పారు. కొన్ని కంపెనీల్లో మాత్రమే పిల్లలపై ట్రయల్స్ నిర్వహిస్తున్నందున వారికి వ్యాక్సిన్ అందుబాటులోకి రావడానికి ఎక్కువ టైమ్ పట్టేలా ఉందన్నారు.