కేసీఆర్​ వల్లే కృష్ణా ట్రిబ్యునల్ ​ఆలస్యం : పొంగులేటి సుధాకర్​ రెడ్డి

కేసీఆర్​ వల్లే  కృష్ణా ట్రిబ్యునల్ ​ఆలస్యం :  పొంగులేటి సుధాకర్​ రెడ్డి

హైదరాబాద్, వెలుగు: సీఎం కేసీఆర్ వల్లే కృష్ణా ట్రిబ్యునల్​ఏర్పాటు ఆలస్యమైందని బీజేపీ కోర్​కమిటీ సభ్యుడు, తమిళనాడు రాష్ట్ర సహ ఇన్​చార్జ్ పొంగులేటి సుధాకర్​రెడ్డి ఆరోపించారు. ఏపీ సీఎంతో కేసీఆర్​ కుమ్మక్కయ్యారనే విషయాన్ని రాష్ట్ర రైతులు గుర్తించాలని ఒక ప్రకటనలో  కోరారు. సీఎం​వైఖరితో  తెలంగాణ నష్టపోతున్నందువల్లే కేంద్ర ప్రభుత్వం ట్రిబ్యునల్​ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకుందని తెలిపారు. కేంద్ర నిర్ణయంతో 50 లక్షల మంది రైతులకు ప్రయోజనం కలుగుతుందని వెల్లడించారు. విభజన చట్టంలోని సెక్షన్​89కి ఇబ్బంది లేకుండా కృష్ణా ట్రిబ్యునల్​కు కేంద్రం అదనపు బాధ్యతలు అప్పగించిందని వివరించారు.